జగన్ కేసులో 2 ఛార్జీషీట్స్: గీతా, సబిత, ధర్మానల పేర్లు

Another two Chargesheets in Jagan case
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) మంగళవారం మరో రెండు ఛార్జీషీట్లను దాఖలు చేసింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఇందూ సంస్థలపై తాజా ఛార్జీషీట్లు దాఖలు చేసింది.

ఇందూ సంస్థ నుండి జగన్ కంపెనీలోకి రూ.70 కోట్ల రూపాయలు మళ్లించినట్లుగా తాము గుర్తించినట్లు సిబిఐ ఛార్జీషీట్లో పేర్కొంది. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇందూ సంస్థకు అనంతపురంలో 8,848 ఎకరాల భూమిని కేటాయించారు. శంషాబాదులో ఇందు టెక్‌కు 250 ఎకరాల భూమిని కేటాయించారు. దీనిని సిబిఐ పేర్కొంది.

ఛార్జీషీటులో గీతా రెడ్డి

లేపాక్షి అంశానికి సంబంధించిన ఛార్టీషీటులో మంత్రి గీతా రెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావులపై, ఇందు ప్రాజెక్టు అంశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిలపై సిబిఐ అభియోగాలు దాఖలు చేసింది. గీతా రెడ్డిని ఎ9గా, ధర్మానను ఎ11గా, సబితా ఇంద్రా రెడ్డిని ఎ8గా పేర్కొంది.

లేపాక్షి నాలెడ్జ్ హబ్ అంశంలో పద్నాలుగు మందిపై, ఇందూ అంశంలో పదిమందిపై అభియోగాలు మోపింది. ఇందూ అంశంలో జగన్, విజయ సాయి రెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డి, ఇందూ ప్రాజెక్టు, ఇందూ టెక్, ఎస్పీఆర్ ప్రాజెక్టు, రత్నప్రభ, బిపి ఆచార్య, సబితా ఇంద్రా రెడ్డి, పార్థసారథి లను పేర్కొంది.

లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఛార్జీషీట్‌లో నిందితులు.... జగన్, విజయ సాయి రెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డి, బాలాజీ, బిపి ఆచార్య, శ్యాంసన్ రాజు, గీతా రెడ్డి, శ్యామ్యూల్, ధర్మాన ప్రసాద రావు, మురళీధర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జగతి పబ్లికేషన్స్‌ను పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+