బయటకొచ్చిన మాచర్ల అసలు వీడియో..జరిగింది ఇదే
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నేల్లి రామకృష్ణరెడ్డి వ్యవహారం గురించే చర్చ సాగుతోంది. పోలింగ్ నాడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై ఏపీలో విపరీతమైన చర్చ నడుస్తోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల కమిషన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేయడంతో వైసీపీని కార్నర్ చేస్తూ టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది.
EC పట్టించుకోనప్పుడు పిన్నెల్లి ఆలా పగలగొట్టటంలో తప్పేముంది..?? pic.twitter.com/pGUjmqtUJp
— Prasad.Thummala (@prasadthummala2) May 23, 2024
అయితే ఈ ఘటనపై వైసీపీ స్పందించింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మద్దతుగా నిలుస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది.ఈవీఎం ధ్వంసం చేసిన వీడియోను మాత్రమే బయటపెట్టారని..అంతకుముందు ఆ బూత్‌లో జరిగిన రిగ్గింగ్ గురించి ఎవరూ మాట్లాడటం లేదని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మాచర్లకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు మహిళలు టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఈ వీడియోలో కనిపించింది.

ఓ సామాజిక వర్గానికి చెందిన నాయకలు తమను ఓటు కూడా వేయనివ్వడం లేదని ఆ మహిళలు వాపోయారు. ఇది ఒక సామాజికవర్గానిదేనా అంటూ ఆ మహిళలు టీడీపీ నేతలను ప్రశ్నించారు. తమను ఓట్లు వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారని ఆ మహిళలు ఆరోపిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పిన్నెల్లి అక్కడకు చేరుకుని..అక్కడి ఈవీఎం ధ్వంసం చేశారని తెలుస్తోంది. పోలింగ్ బూత్‌లో టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని తెలిసిన తర్వాతే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి మాచర్ల ఘటనపై టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మాచర్లకు సంంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications