వైసీపీని వీడేందుకు మరో ఎమ్మెల్యే రెడీ ? అభివృద్ధి పేరుతో ఎదురుదాడి..!
ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు ఇతర పార్టీలకు, ముఖ్యంగా విపక్షాలకు శరాఘాతంగా మారుతుందని తొలుత భావించగా.. ఇప్పుడు సొంత పార్టీకి సైతం ఇది ఇబ్బందికరంగా మారుతోంది. గతంలో గెలిచిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు మరసారి అవకాశం దక్కదన్న అంచనా ఇప్పుడు వారిని కుదురుగా ఉండనీయడం లేదు. తమకు అన్నీ పాజిటివ్ గా ఉన్నా టికెట్లు నిరాకరించేందుకు అధిష్టానం సాకులు వెతుక్కుంటోందన్న ఫీలింగ్ వారిలో పెరుగుతోంది. దీంతో పార్టీని వీడేందుకూ సిద్ధపడుతున్నారు.
రాష్ట్రంలో ఇన్ ఛార్జ్ ల మార్పుల నేపథ్యంలో కృష్ణా జిల్లా పెడన నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జోగి రమేష్ ను పెనమలూరు సీటుకు మార్చారు. దీంతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్ధసారధికి సీటు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పార్ధసారధి వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అదే సమయంలో పెడన నుంచి పెనమలూరు వచ్చిన మంత్రి జోగి రమేష్ కు సైతం ఇక్కడ పరిస్దితులు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. వైసీపీలో స్ధానిక నేతలు ఆయన్ను నాన్ లోకల్ అని ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఎన్నికలకు ముందే ఆయనకు ఇబ్బందికరంగా మారింది.

దీంతో జోగి రమేష్ కన్ను మరోసారి మైలవరం సీటుపై పడింది. గతంలో ఓసారి ఎమ్మెల్యేగా గెలిచిన మైలవరం నుంచి తిరిగి పోటీ చేసేందుకు రెండేళ్లుగా జోగి రమేష్ తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో స్దానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పంచాయతీ సీఎం జగన్ వద్దకు వెళ్లడంతో ఆయన వసంతకే టికెట్ ఖరారు చేశారు. అయితే మారిన పరిస్ధితుల్లో తిరిగి జోగి రమేష్ పెనమలూరు కాదని మైలవరం వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. దీనికి అధిష్టానం కూడా సుముఖంగానే ఉన్నట్లు సంకేతాలు ఇస్తోంది. దీంతో వసంతకు ఇబ్బంది మొదలైంది.
ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సీటుపై ఏమీ చెప్పలేనని, సీఎం మాత్రమే స్పష్టత ఇస్తారని తేల్చేశారు. మైలవరంలో తన పోటీపై అన్ని విషయాలు వచ్చే నెల 4,5 తేదీల్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్తానన్నారు. దీంతో ఆయన వైసీపీని వీడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో వైసీపీపై వసంత మాటల దాడి మొదలుపెట్టారు.
వైసీపీ సర్కార్ సంక్షేమంపై పెడుతున ఫోకస్ తో అభివృద్ధి విషయంలో తమకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఇప్పుడు సంక్షేమం అందరికీ లైట్ అయ్యాయని, అభివృద్ధి కావాలంటున్నారని వసంత వ్యాఖ్యానించారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications