భారీ ఎన్‌కౌంటర్: తప్పించుకున్న ఆర్కే, ముగ్గురు మహిళా మావోలతోపాటు వ్యక్తి మృతి
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్-ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో బుధవారం మరోసారి భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మహిళ మావోయిస్టులతోపాటు మరో వ్యక్తి మృతి చెందాడు. నలుగురి మృతేదహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, మావోయిస్టు అగ్రనేత ఆర్కే మాత్రం ఈ ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్నారు.
ఈ ఎన్‌కౌంటర్ రాయగడ్-కోరాపుట్ సమీపంలో చోటు చేసుకుంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతానికి బుధవారం మధ్యాహ్నం భద్రతా దళాలు చేరుకున్నాయి. మావోయిస్టుల మృతదేహాలను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.

ఘటనా స్తలంలో మూడు ఏకే47లు లభ్యమవడంతో మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఈ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications