17కి చేరిన మృతులు: పొలాల్లో చెల్లాచెదురుగా(ఫోటోలు)
హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సోమవారం జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 17కి చేరింది. నిన్న 12 మంది మృతి చెందగా ఇవాళ ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 17కి చేరింది. ఇందులో మహిళలు 14 మంది మహిళలు ఉండగా ముగ్గురు పురుషులు ఉన్నారు.
ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాణసంచా తయారీ యజమానిపై కఠినచర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మంగళవారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా వాకతిప్పలో బాణసంచా పేలుడు బాధితులను పరామర్శించారు. విధుల్లో అలసత్వం వహించిన కొత్తపల్లి ఎమ్మార్వోను సస్పెండ్ చేస్తూ ఆయన ఆదేశాలు జారీ చేసారు. ఇలాంటి సంఘటనులు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
బాణసంచా ఘటన పట్ల కాంగ్రెస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. చిరంజీవి తీవ్ర విచారం వెలిబుచ్చారు. అనధికారకంగా బాణసంచా తయారు చేస్తుంటే, జిల్లా యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, అమాయకులు బలైపోతున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని, మృతుల కుటుంబాల వారిని ఉదారంగా ఆదుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాలందించాలని చిరంజీవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బాణసంచా పేలుడు ఘటన చెల్లా చెదురుగా మృతదేహాలు
పేలుడు థాటికి మృతదేహాలు గుర్తుపట్ట లేని విధంగా మారాయి. భారీ విస్పోటనానికి ఎక్కడివారు అక్కడే మృత్యువాతపడ్డారు. మృతదేహాలను తరలిస్తున్న సమయంలో కాళ్లు, చేతులు తదితర శరీర భాగాలు ఊడి పోయాయి.

బాణసంచా పేలుడు ఘటన చెల్లా చెదురుగా మృతదేహాలు
పోలీసులు, అగ్నిమాపకశాఖ సిబ్బంది,వైద్య సిబ్బంది, 108 సిబ్బంది సహా యక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు.

బాణసంచా పేలుడు ఘటన చెల్లా చెదురుగా మృతదేహాలు
పోలీసులు, అగ్నిమాపకశాఖ సిబ్బంది,వైద్య సిబ్బంది, 108 సిబ్బంది సహా యక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు.

బాణసంచా పేలుడు ఘటన చెల్లా చెదురుగా మృతదేహాలు
పోలీసులు, అగ్నిమాపకశాఖ సిబ్బంది,వైద్య సిబ్బంది, 108 సిబ్బంది సహా యక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు.

బాణసంచా పేలుడు ఘటన చెల్లా చెదురుగా మృతదేహాలు
ప్రమాద స్థలంలో చెల్లా చెదురుగా ఉన్న శవాలను కొత్తపల్లి పిహెచ్‌సీ డాక్టర్ ఆర్ శ్రీనివాసనాయక్, పిఠాపురం సిహెచ్‌ఎన్‌సీ వైద్యుడు సాయి ప్రసాద్, కొమరగిరి ఫిహెచ్‌సీ డాక్టర్ రుక్ష్మిణి అంబులెన్స్‌లో ఎక్కించి జీజీహెచ్ తరలించారు.

బాణసంచా పేలుడు ఘటన చెల్లా చెదురుగా మృతదేహాలు
ఎంతో కాలంగా బాణసంచా తయారు చేస్తున్నా ఎన్నడూ ఇటువంటి సంఘటనలు జరగలేదని స్థానికులు వాపోతున్నారు. ప్రమాదంలో బాణసంచా తయారీ కేంద్ర యజమాని కుమారుడు అప్పారావు కాలు పూర్తిగా కాలిపోగా తల్లి లక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి.

బాణసంచా పేలుడు ఘటన చెల్లా చెదురుగా మృతదేహాలు
వాకతిప్పకు చెందిన వెంకటరమణ బాణసంచా సరుకులు తయారుచేస్తుంటారు. దీపావళి దగ్గరకు రావడంతో ఎప్పటి లాగే సోమవారం మధ్యాహ్నం వాకతిప్పలో ఊరు చివరపొలాల్లో బాణసంచా సరుకులు తయారీలో కార్మికులు నిమగ్నమయ్యారు.
బాణసంచా పేలుడు ఘటన చెల్లా చెదురుగా మృతదేహాలు
హోం మంత్రి చినరాజప్ప, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, ఎంపీ నరసింహం, పిఠాపు రం ఎమ్మెల్యే వర్మ, కలెక్టర్ నీతూప్రసాద్, జేసీ ముత్యాలరాజు, ఏజేసీ మార్కెండేయులు తది తరులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

బాణసంచా పేలుడు ఘటన చెల్లా చెదురుగా మృతదేహాలు
ఈ సందర్భంగా ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాణసంచా తయారీ యజమానిపై కఠినచర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
అసలు ఏం జరిగింది?
వాకతిప్పకు చెందిన వెంకటరమణ బాణసంచా సరుకులు తయారుచేస్తుంటారు. దీపావళి దగ్గరకు రావడంతో ఎప్పటి లాగే సోమవారం మధ్యాహ్నం వాకతిప్పలో ఊరు చివరపొలాల్లో బాణసంచా సరుకులు తయారీలో కార్మికులు నిమగ్నమయ్యారు. ఉన్నట్టుండి మధ్యాహ్నం 2.45 గంటలకు బాణసంచా కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించి భారీ విస్ఫోటనం జరిగింది.
పేలుడు థాటికి మృతదేహాలు గుర్తుపట్ట లేని విధంగా మారాయి. భారీ విస్పోటనానికి ఎక్కడివారు అక్కడే మృత్యువాతపడ్డారు. మృతదేహాలను తరలిస్తున్న సమయంలో కాళ్లు, చేతులు తదితర శరీర భాగాలు ఊడి పోయాయి. ఒక మృతదేహం రెండు భాగాలు గా వేర్వేరుచోట పడింది. దీపావళి వస్తువులు త యారుచేస్తున్న మహిళలు మంటల్లో కాలిపోయిన ఘటన హృదయ విచారకంగా ఉంది.
దీపావళి రెండు రోజులు ఉందనే ఉద్ధేశంతో యజమాని కొప్పిశెట్టి రమణ రోజుకంటే సోమ వారం అదనంగా మరో 20 మందిని పనిలో పెట్టుకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఒకసారి గా సంభవించిన పేలుడు శబ్ధం దాదాపు కిలోమీటరున్నర వరకు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు.
మధ్యాహ్నం టీ తయారు చేయడానికి మ హిళ గ్యాస్ స్టౌ వెలిగించే ప్రయత్నంలో సిలిండర్ పేలి భారీ విస్పోటం సంభవించి ఉంటుందని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలంగా బాణసంచా తయారు చేస్తున్నా ఎన్నడూ ఇటువంటి సంఘటనలు జరగలేదని స్థానికులు వాపోతున్నారు. ప్రమాదంలో బాణసంచా తయారీ కేంద్ర యజమాని కుమారుడు అప్పారావు కాలు పూర్తిగా కాలిపోగా తల్లి లక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి.
ద్రాక్షారపు కాంతం(55) ద్రా క్షారపు చినతల్లి(50) మసకపల్లి బుజ్జి(30) మసకపల్లి కుమారి(28), మసకపల్లి గంగ (28), మసకపల్లి అప్పయ్యమ్మ(65) మసకపల్లి పుష్పవతి(40) ఉల్లంపర్తి కామరాజు, అర్జిల్లి రత్నం(24) ఉండ్రారపు కీర్తి(20) వాసంశెట్టి రాఘవ(60) అక్కడికక్కడే దుర్మరణం చెందారు.












Click it and Unblock the Notifications