సీజీజీ, ఖాతా: ఏపీ-టీల మధ్య కొత్త వివాదాలు, బాబు సెక్యూరిటీ నుంచి టీ సిబ్బంది రిలీవ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరొ వివాదం రాజుకుంది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) డైరెక్టర్ నియామకం విభేదాలకు కారణమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సీజీజీ డైరెక్టర్‌ను నియమించింది.
ముఖేష్ కుమార్ మీనాను ఏపీ సీజీజీ డైరెక్టర్‌గా నియమించింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం అంతకుముందే ఐఏఎస్ అధికారిని సీజీజీ డైరెక్టర్‌గా నియమించింది. ఐఏఎస్ అధికారి రామకృష్ణ రావును తెలంగాణ నియమించింది. ఏపీ కొత్తగా సీజీజీ డైరెక్టర్‌ను నియమించడం గమనార్హం. తద్వారా చెరొకరి చొప్పున రెండు ప్రభుత్వాలు డైరెక్టర్లను నియమించాయి.
సీజీజీ డైరెక్టర్‌గా తెలంగాణ నియమించిన రామకృష్ణా రావు అమెరికా పర్యటనలో ఉండటంతో తెలంగాణ శివశంకర్‌కు బాధ్యతలు అప్పగించింది. మరోవైపు, హైదరాబాదులోని 147 ఉమ్మడి శాఖలలో బ్యాంక్ ఖాతాలు తెరవాలని ఏపీ ఆర్థిక శాఖ నిర్ణయించింది.
బాబు సెక్యూరిటీ నుంచి 40 మంది తెలంగాణ పోలీసులు రిలీవ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ నుండి 40 మంది తెలంగాణ పోలీసులను రిలీవ్ చేశారు.
విద్వేషాలు రగిలించొద్దు: గుత్తా
తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సెక్షన్ 8పై సామరస్యంగా చర్చించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. మాటల తూటాలతో ప్రజల మధ్య విద్వేషాలు రగిలించవద్దన్నారు. ఓటుకు నోటు కేసులో ఏసీబీ తన పని తాను చేస్తోందన్నారు. చట్టానికి ఎవరూ అతీతులుకారని, ఈ కేసులో ఆధారాలుంటే చట్టం ముందు లొంగిపోవాల్సిందేనన్నారు.












Click it and Unblock the Notifications