రోశయ్య- వైఎస్సార్ మంచి స్నేహితులు : అందరికీ ఆదర్శంగా : అసెంబ్లీలో సీఎం జగన్..!!
ఏపీ అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ రోశయ్య కు నివాళి అర్పించారు. రోశయ్య సంతాప తీర్మనంలో భాగంగా సీఎం జగన్ ఆయన సేవలను కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద రోశయ్య మంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. విద్యార్థి నాయకుడి దశ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ, ముఖ్యమంత్రి, చివరగా గవర్నర్‌గా సుదీర్ఘకాలం రోశయ్య ప్రజాజీవితంలో కొనసాగారన్నారు. తన తండ్రితో రోశయ్యకు ఉన్న అనుబంధాన్ని సీఎం జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వైఎస్సార్ రోశయ్య మంచి స్నేహితులుగా ఉండేవారని గుర్తుచేశారు.
లేకపోవటం బాధాకరం
అలాంటి మంచి మనిషి మనమధ్య లేకపోవడం బాధాకరమని, రోశయ్య ఆత్మకు శాంతికలగాలని మనసారా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు సీఎం వైయస్ జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. రోశయ్య తో పాటుగా మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించింది.
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రోశయ్య సేవలను గుర్తు చేసారు. ఆర్ధిక శాఖ మంత్రిగా 16 సార్లు అందులో వైఎస్ హయాంలో 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్య కే దక్కుతుందన్నారు. రోశయ్య మరణాన్ని టిడిపి నేతలు రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. రోశయ్య చనిపోతే ముగ్గురు మంత్రులను సీఎం జగన్ పంపించారని గుర్తు చేసారు.

ఆర్దిక మంత్రిగా సమర్ధవంతంగా
సీనియర్ నేత ఆనం తాము కొత్తగా సభలో అడుగు పెట్టిన సమయంలో సమయం దొరికినప్పప్పుడు కౌన్సిల్ వెళ్లి రోశయ్య ప్రసంగాలు వినాలని ఆ నాటి సభ సెక్రటరీ తమకు సలహా ఇచ్చారని చెప్పుకొచ్చారు. డిజిటలైజేషన్ ఆడియోటేపులే కాకుండా, వీడియో టేపులు కూడా రీరికార్డు చేసి ప్రభుత్వ పరిపాలన ఏవిధంగా కొనసాగించాలో చెప్పే విధంగా రికార్డు చేసిన కాపీలను అందిస్తే బాగుటుందని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు.
రాజశేఖరరెడ్డి హయాంలో సామన్య ప్రజలకు ఎలాంటి పథకాలు అందించాలని ఆలోచన చేసేవారు. ఏనాడు కూడా ఒక్క రోజు ఓవర్ డ్రాప్ట్‌కు వెళ్లలేదని..అంతలా రోశయ్య ఆర్దిక శాఖ నిర్వహించారని కొనియాడారు.

వైఎస్సార్ మరణం తరువాత
వైయస్‌రాజశేఖరరెడ్డి అకాల మరణం తరువాత రాష్ట్రం ఇబ్బంది పడింది. ఆ సమయంలో పెద్దదిక్కుగా రోశయ్య ఉంటూ సీఎంగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని సక్రమంగా నడిపించారని కీర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో రోశయ్య ప్రత్యేక ముద్ర వేసుకున్నారని, విలువలతో కూడిన రాజకీయం చేశారని టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు కీర్తించారు.
తెలుగు రాష్ట్రాల్లో రోశయ్య ప్రత్యేక ముద్ర వేసుకున్నారని, విలువలతో కూడిన రాజకీయం చేశారని ఆయన కొనియాడారు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఆయన సేవలు ఎనలేనివని గుర్తు చేశారు. రోశయ్య మరణంపై రాజకీయం చేయాలనుకోవడం లేదని, మేం అధికారంలో ఉన్నప్పుడు ఎవరు మృతి చెందినా గౌరవించామన్నారు.












Click it and Unblock the Notifications