చంద్రబాబు ఇంటికి పోలీస్ ఉన్నతాధికారులు..భారీ భద్రత; మంగళగిరిలో సంబరాలు!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి దూకుడు కొనసాగుతుంది. కౌంటింగ్ లో ఆది నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి స్పష్టమైన ఆధిక్యతతో దూసుకు వెళుతోంది. ప్రస్తుతం 160 స్థానాలలో టిడిపి కూటమి ఆధిక్యంలో ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో పెద్ద ఎత్తున సంబరాలు కొనసాగుతున్నాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ తన ఎక్స్ ఖాతాలోనూ ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనాన్ని పోస్టులు పెడుతోంది. ఏపీలో కూటమి గెలుస్తోందని , రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి తిరుగులేని ఆధిక్యం వస్తుందని, ప్రజలు ఏకపక్షంగా కూటమికి పట్టం కడుతున్నారు అంటూ టిడిపి అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.

మొత్తం 160 స్థానాలలో టిడిపి కూటమి ఆధిక్యతను కొనసాగిస్తుందని ప్రస్తుతం ఉన్న ట్రెండును బట్టి అర్థమవుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి భద్రతను పెంచడంలో బిజీగా ఉంది అధికార యంత్రాంగం . ఈ క్రమంలో చంద్రబాబు ఇంటికి చేరుకున్న పోలీస్ ఉన్నతాధికారులు చంద్రబాబుకు భారీ భద్రత కల్పించేలా ప్రోటోకాల్ నిబంధనలను పర్యవేక్షిస్తున్నారు.
నాలుగు దశాబ్దాల్లో ఆరవసారి అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ ఒక హిస్టరీని క్రియేట్ చేసింది. టిడిపి ఈ విజయంతో ఒక సంచలన రికార్డును సృష్టించింది. కూటమి పొత్తులతో ముందుకు వెళ్లి చేసిన ప్రయత్నం చంద్రబాబుతో పాటు కూటమి పార్టీలన్నిటికీ మంచి సానుకూల ఫలితాలను ఇచ్చింది. వైసీపీ ఊహించని దారుణమైన పరాజయాన్ని చూస్తుంది.
మొత్తంగా ఏపీలో కూటమి విజయం దిశగా అడుగులు వేస్తున్న చోట సంబరాలు మొదలయ్యాయి. మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటికే లోకేష్ విజయం ఖరారు కావడంతో టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు.












Click it and Unblock the Notifications