జగన్ కు ప్రతిపక్ష హోదా-తన నిస్సహాయత చెప్పేసిన స్పీకర్ ?

ఏపీలో గత ఎన్నికల్లో 11 సీట్లు సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కూటమి ప్రభుత్వం విపక్ష నేత హోదా ఇవ్వకుండా నిరాకరించింది. ఇదే అంశంపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడిని పలుమార్లు కోరిన జగన్.. ఆయన పట్టించుకోకపోవడంతో హైకోర్టును సైతం ఆశ్రయించారు. అయినా జగన్ కు ఊరట దక్కలేదు. ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యనపాత్రుడు జగన్ కు విపక్ష నేత హోదా విషయంలో తన నిస్సహాయతను బయటపెట్టేశారు. అదీ ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోనే కావడం మరో విశేషం.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను అసెంబ్లీకి హాజరుకావాలంటూ తాను స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో సూచించానని అయన్నపాత్రుడు తెలిపారు. కానీ జగన్ అసెంబ్లీకి రాకుండా.. తన ప్యాలెస్‌లో కూర్చొని మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడికి ప్రసంగించడానికి ఎంత సమయం ఇస్తున్నారో.. తనకు అంత సమయం ఇవ్వాలని వైఎస్ జగన్ అంటున్నారని, ఇదేం విచిత్రమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సెటైర్లు వేశారు.

ap assembly speaker ayyannapatrudu strong counter to ys jagan s remarks on LOP status

ప్రస్తుతం వైఎస్ జగన్ కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యకు ప్రతిపక్ష నేత హోదా రాదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి స్పష్టం చేశారు. 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే గానీ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే వీలు లేదన్నారు. అసెంబ్లీ స్పీకర్ గా తనకు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోలేనన్నారు. అసెంబ్లీ నియమాలు, నిబంధనలు జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి వారి నియోజకవర్గాలకు సంబంధించిన సమసల్యపై చర్చించాలని స్పీకర్ సూచించారు.

తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన వైఎస్ జగన్ అసెంబ్లీకి రావాలంటూ పదే పదే స్పీకర్, అధికార కూటమి నేతలు చేస్తున్న డిమాండ్లపై ఘాటుగా స్పందించారు. తాను విపక్ష నేత హోదా అడుగుతుంటే ఇవ్వకుండా నంబర్లను సాకుగా చూపుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో సీఎంగా చంద్రబాబుకు ఇచ్చినంత సమయం తనకూ ఇస్తే వస్తానని తేల్చిచెప్పేశారు. అలా ఇవ్వడం లేదు కాబట్టే తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఇంట్లో నుంచే ప్రజలకు చెబుతున్ననట్లు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+