Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ ఎన్నికల ఫలితం పై ఢిల్లీ బీజేపీ ఫుల్ క్లారిటీ - గెలుపు వారిదే..!!

ఏపీలో అధికారం దక్కేదెవరికి. ఇప్పుడు రాజకీయంగా ప్రతీ చోట జరుగుతున్న చర్చ ఇది. ఎవరి అంచనాల్లో వారు నిమగ్నయ్యారు. టీడీపీ, వైసీపీ గెలుపు పైన ధీమాతో ఉన్నాయి. గెలుపు తమదేనని ఆ పార్టీల నేత లు విశ్వాసంతో ఉన్నారు. జగన్ ఏకంగా 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామంటూ వ్యాఖ్యానించారు. ఈ సమయంలోనే బీజేపీ ఢిల్లీ నాయకత్వం ఏపీలో పోలింగ్ సరళి..అంచనాల పైన నివేదికలు తెప్పించింది. ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరికి దక్కుతుందనే దాని పైన పూర్తి స్పష్టతకు వచ్చింది.

విజయం ఎవరిది
ఏపీలో బీజేపీ కూటమిలో భాగంగా టీడీపీ, జనసేనతో జత కట్టింది. వైసీపీకి వ్యతిరేకంగా పోరాటంలో భాగస్వామ్యం తీసుకుంది. ఏపీలో పది అసెంబ్లీ, ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేసింది. ప్రధాని మోదీ, అమిత్ షా తో సహా బీజేపీ ముఖ్యులు ఏపీలో ప్రచారం చేసారు. ప్రదాని మోదీ రెండు విడతలుగా చేసిన ప్రచారం తరువాత కూటమికి అనుకూల ఫలితాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేసారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఏపీలో మొదలవుతుందని చెప్పుకొచ్చారు. ఏపీలో ఎన్నికల తరువాత పోలింగ్ సరళి పైన ఢిల్లీ నుంచి బీజేపీ ముఖ్య నేతలు పలు మార్గాల్లో సమాచారం సేకరించారు. ప్రత్యేకంగా గ్రామీణ, మహిళా ఓటర్ల నాడి గురించి అడిగి తెలుసుకున్నారు.

AP BJP Key leaderssumbits reports the party leader ship over Assembly poll Trends

రీజియన్ల వారీ లెక్కలు
గతం కంటే పోలింగ్ శాతం పెరగటం ఎవరికి అనుకూలమనే కోణంలో ఆరా తీసినట్లు సమాచారం. కేంద్ర ఇంటలిజెన్స్ తో పాటుగా మూడు సర్వే సంస్థల నుంచి బీజేపీ నాయకత్వానికి ఏపీ ఎన్నికల సరళి పైన తాజాగా నివేదికలు అందాయి. అదే విధంగా బీజేపీ కేంద్ర నాయకత్వంతో సత్సంబంధాలు ఉన్న ఏపీకి చెందిన ఒక ముఖ్య నేత సైతం ప్రత్యేకంగా సర్వే అంచనాలను పార్టీకి అందించారు. గతంలో ఆయన పలు సర్వేలు వెల్లడించిన అనుభవం ఉంది. సెఫాలజిస్ట్ గా గుర్తింపు ఉన్న నేత కావటంతో ఆయన చేసిన విశ్లేషణ పార్టీలో చర్చకు కారణమైంది. ఆ నేత ఏపీలో మూడు రీజియన్ల వారీగా ఓటింగ్ సరళి..ఏ పార్టీకి ఎక్కడ అనుకూలంగా పోలింగ్ జరిగిందనే లెక్కలు ఇచ్చినట్లు సమాచారం.

AP BJP Key leaderssumbits reports the party leader ship over Assembly poll Trends

ఆ పార్టీదే విజయం
అందులో భాగంగా వైసీపీ, టీడీపీ పోటా పోటీగా నిలిచిన స్థానాల గురించి విశ్లేషించారని తెలుస్తోంది. ఏపీలో మూడు పార్టీల మధ్య ఓట్ల బదిలీ అనకున్న స్థాయిలో జరగేలదని నివేదించినట్లు సమాచారం. ఇక, రాయలసీమలో మూడు జిల్లాల్లో ఒక పార్టీకి ఏకపక్షంగా ఓటింగ్ జరిగిందని..మరో జిల్లాలో రెండు ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోలింగ్ జరిగిందని చెప్పినట్లు తెలుస్తోంది. గోదావరి జిల్లాల్లో బీజేపీ కి చెందిన ఆ నేత ఇచ్చిన నివేదికతో పార్టీ నాయకత్వం సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. మొత్తంగా ఏపీలో ఒక ప్రధాన పార్టీకి 55 శాతం వరకు ఓటింగ్ అంచనాలు కనిపించినా... పోలింగ్ లెక్కలు పరిశీలించిన తరువాత 52 శాతం మేర ఓటింగ్ దక్కినట్లు తేల్చారని విశ్వసనీయ సమాచారం. ఆ పార్టీ మెజార్టీ సీట్లతో అధికారంలోకి వస్తుందని నివేదిక ఇచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+