నన్ను ముసలోడివి అంటావా: కొండారెడ్డి బురుజు దగ్గర తేల్చుకుందామా? పవన్‌ను ఏకి పారేసిన బైరెడ్డి
కర్నూలు: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై బీజేపీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. రాయలసీమ ఉద్యమంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. తనను ముసలివాడిగా అభివర్ణించడం పట్ల బైరెడ్డి మండిపడ
కర్నూలు: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై బీజేపీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. రాయలసీమ ఉద్యమంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. తనను ముసలివాడిగా అభివర్ణించడం పట్ల బైరెడ్డి మండిపడ్డారు. ఎవరు ఎవరి తోలు తీస్తారో.. ఎవరు ఎవరి తొక్క తీస్తారో.. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద తేల్చుకుందామా? అంటూ సవాల్ విసిరారు. తాను దీనికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ వన్నీ తిక్కమాటలేనని బైరెడ్డి ఎదురుదాడికి దిగారు. ఎప్పుడో ఒకప్పుడు రాష్ట్రానికి వచ్చి నోటికి వచ్చిందల్లా మాట్లాడి మళ్లీ కనిపించకుండా పోతుంటాడని, అలాంటి వాడిని రాజకీయ నాయకుడిగా ఎలా భావిస్తారని ప్రశ్నించారు. రాజకీయం అంటే ఒకరు రాసిన డైలాగులను చదవడం, కెమెరా ముందుకొచ్చి నాటకాలు వేసుకోవడం కాదని హితవు పలికారు. పవన్ కల్యాణ్ జీవితంలో మోసాలు తప్ప ఇంకేమీ లేవని అన్నారు. రాయలసీమలో పవన్ కల్యాణ్ కు ఉప్పు కూడా పుట్టదని బైరెడ్డి తేల్చిచెప్పారు.

అలాంటి వ్యక్తి వచ్చి ఉద్యమాలను అణచి వేస్తానని, తాను అందరినీ మించిన తీవ్రవాదినని చెప్పుకోవడం హాస్యాస్పదమని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తేల్చి చెప్పారు. పవన్ కల్యాణ్ ఎంత తీవ్రవాది అనేది తెలంగాణలోనే తేలిపోతోందని బైరెడ్డి పేర్కొన్నారు. తన తీవ్రవాదం ఏమిటో పవన్ కల్యాణ్ అక్కడ చూపించగలడా? అని నిలదీశారు. రాయలసీమ ఉద్యవాదాన్ని అణచివేయడానికి పవన్ కల్యాణ్ ఏమైనా పోలీసు అధికారా? అని ప్రశ్నించారు.
రాయలసీమ ఉద్యమ సెంటిమెంట్ గురించి పవన్ కల్యాణ్ గురించి అక్షరం ముక్క కూడా తెలియదని బైరెడ్డి అన్నారు. ఈ ఉద్యమాన్ని అణచివేస్తామని హెచ్చరించి- పవన్ కల్యాణ్ రాయలసీమ ప్రజలను అవమానపర్చాడని ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ వంటి లక్షమంది వచ్చినా రాయలసీమ ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తే పవన్ కల్యాణ్ కనీసం నోరెత్త లేదని గుర్తు చేశారు. ఇక్కడికొచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని, తన నోటిని అదుపులో పెట్టుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications