కేసీఆర్‌‌ను ప్రజలు నమ్మాలంటే ముందు ఈ పని చెయ్యాలి - అది నేరం కూడా కాదు..!!

అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై భారతీయ జనత పార్టీ ఏపీ శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 2024 ఎన్నికల నాటికి థర్డ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తామని, కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడితే తాను ప్రధానమంత్రిని అవుతానని చెప్పడాన్ని తప్పుపట్టారు. ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల అంశాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

2024 ఎన్నికల అనంతరం తాను ప్రధాని అవుతానని కేసీఆర్ కలలు కంటున్నారని విమర్శించారు. పగటి కలలు కనడం తప్పు కాదని ఎద్దేవా చేశారు. 2024 తరువాత కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటైతే- తాను ప్రధానమంత్రిని అవుతానని ఊహించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తాను ప్రధానమంత్రి అవుతానని, దేశవ్యాప్తంగా రైతులందరికీ ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తానని చెప్పడం- కేసీఆర్ పగటి కలలకు నిదర్శనమని చెప్పారు.

 AP BJP leader Vishnu Vardhan Reddy slams Telangana CM KCR over his comments on free power.

కేసీఆర్ పగటి కలలను కనడంలో తప్పులేదని, అది నేరం కూడా కాదని విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ నిరంతరం పగటి కలల్లోనే విహరిస్తూ ఉంటారని చెప్పారు. దేశవ్యాప్తంగా రైతాంగానికి ఉచిత విద్యుత్‌ను అందజేయడం కంటే మొదటగా ఆయన చేయాల్సిన పని ఏమిటనేది సూచించారు. కేసీఆర్ వైఖరి- అమ్మకు అన్నం పెట్టలేని కొడుకు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాననే సామెతను గుర్తు చేస్తోందని విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు.

ముందుగా కేసీఆర్- ఏపీకి చెల్లించాల్సిన 6,756.92 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలను చెల్లించాలని సూచించారు. అయిదారు సంవత్సరాలుగా ఏపీకి బకాయిలను చెల్లించలేక, అప్పుల పాలయ్యారని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. అలాంటి కేసీఆర్ దేశానికి ఏ రకంగా విద్యుత్ సరఫరా చేస్తారని ప్రశ్నించారు. తన సొంత రాష్ట్రంలో రైతాంగానికి కరెంటు ఇవ్వలేక, ఏపీకి బకాయిలను చెల్లించలేని కేసీఆర్ దేశమంతా ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పడం హాస్యాస్పదమని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+