గవర్నర్ ను కలిసి బీజేపీ నేతలు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఆ సమయంలో సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన భారతీయ జనతాపార్టీ నాయకుడు మొగిరాల సురేష్‌ను పోలీసులు అడ్డగించారు. ఈ క్రమంలో కావలి డీఎస్పీ వెంకటరమణ.. సురేష్‌ను తన రెండు కాళ్లతో బంధించి నొక్కడం వైరల్ గా మారింది.

తమ పార్టీ నాయకుడిపై డీఎస్పీ కర్కశంగా వ్యవహరించడంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా స్పందించింది. డీజీపీ, జాతీయ బీసీ కమిషన్‌, మానవ హక్కుల సంఘానికి ఇప్పటికే ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో పార్టీ నేతలు గవర్నర్‌ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కావలిలో పోలీసులు వ్యవహరించిన తీరును గవర్నర్ కు వివరించారు. డీఎస్పీని సస్పెండ్ చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

bjp leaders

గవర్నర్‌ను కలిసిన తర్వాత సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తోందని, బీసీలంటే సీఎం జగన్‌కు ఎందుకంత చిన్న చూపు అని ప్రశ్నించారు. వైసీపీ ఆధ్వర్యంలో బీసీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేయబోతున్నట్లు తెలిపారు. తమ పార్టీ నాయకుడు సురేష్ పై డీఎస్పీ దాడిచేయడం దారుణమని, ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు ముందుగానే పోలీసుల అనుమతి కోరామని, అయినప్పటికీ ఇంతవరకు స్పందన లేదని విమర్శించారు. వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకులపై పోలీసులు దర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. దీన్ని నిరసిస్తూ వచ్చేనెల 16, 17 తేదీల్లో కర్నూలులో బీసీ సామాజిక చైనత్య సదస్సు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+