టార్గెట్ సోము వీర్రాజు - ఢిల్లీ కేంద్రంగా కీలక భేటీ : టీడీపీతో పొత్తుపై..!?
ఏపీ బీజేపీలో సోము వీర్రాజు వ్యతిరేక వర్గం ఢిల్లీ చేరింది. హైకమాండ్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యారు.
ఏపీ బీజేపీలో పోరు మొదలైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లక్ష్యంగా వ్యతిరేక వర్గం ఒక్కటవుతోంది. పార్టీ అధినాయకత్వంతో ఏపీలో పరిస్థితుల పైన చర్చిచేందుకు సిద్దమైంది. ఇందుకు ఢిల్లీ వేదిక కానుంది. ఏపీ నుంచి పలు జిల్లాలకు చెందిన పలువురు నేతలు ఢిల్లీ చేరుకున్నారు. అటు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరుతూ..బీజేపీలో కొందరు నేతలు తనతో టచ్ లో ఉన్నారని చెప్పుకొచ్చారు. పరోక్షం గా బీజేపీ నేతలు టీడీపీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారనే సంకేతాలు ఇచ్చారు. ఈ సమయంలోనే ఢిల్లీలో బీజేపీ నాయకత్వంతో రాష్ట్ర నేతల చర్చలు ఆసక్తి కరంగా మారుతోంది. ఇదే సమయంలో ఏపీలో టీడీపీతో పొత్తు అంశాన్ని ఈ నేతలు నాయకత్వం వద్ద ప్రస్తావించేందుకు సిద్దమయ్యారని సమాచారం.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరి పైన పార్టీలోకి ఒక వర్గం అసంతృప్తితో ఉన్నారు. వారంతా సోము వ్యతిరేకంగా హైకమాండ్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యారు. ఏపీలో పార్టీ భవిష్యత్ పైన చర్చిస్తామని చెబుతున్నా..అసలు లక్ష్యంగా సోము వీర్రాజు నాయకత్వం పైన అసంతృప్తితోనే కలుస్తారని తెలుస్తోంది. ఏపి బిజేపి ఇంచార్జ్ మురళీధరన్ తో ఏపి బిజేపి అసమ్మతి నేతలు సమాశం అవుతున్నారు. ఏపీలో కన్నా తరువాత మరి కొందరు సీనియర్లు పార్టీ వీడేందుకు సిద్దంగా ఉన్నారని వారు నివేదించనున్నట్లు సమాచారం. పార్టీకి రాజీనామా చేసిన తరువాత కన్నాతో ..పార్టీ నేత విష్ణుకుమార్ రాజు సమావేశం అయ్యారు. పార్టీలో ఏం జరుగుతుందో తెలియటం లేదని వ్యాఖ్యానించారు. హైకమాండ్ కు ఏపీలో పార్టీ గురించి ఆలోచించే సమయం దొరకటం లేదని చెప్పుకొచ్చారు.

ఇక..పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఏపీ బీజేపీలో పలు నియామకాలు చేసారు. వాటిలో కొన్ని సోము వీర్రాజు రద్దు చేసారు. వారిలో అధికశాతం ఇప్పుడు కన్నా నిర్ణయానికి మద్దతుగా నిలుస్తున్నారు. బీజేపీలోని పలువురు తనతో టచ్ లో ఉన్నారని కన్నా వ్యాఖ్యానించారు. వీర్రాజుపై అసంతృప్తితో ఉన్న నేతలు తొలుత విజయవాడలోనే భేటీ కావాలని భావించారు. అయితే, పార్టీ నాయకత్వం సూచన మేరకు వారంతా ఢిల్లీ చేరుకున్నారు. వీర్రాజుపైన ఫిర్యాదుతో పాటుగా పొత్తుల అంశం పైన వారు తమ అభిప్రాయాలు వెల్లడించాలని నిర్ణయించినట్లు సమాచారం. జనసేనతో పొత్తు ఉన్నా..కలిసి వెళ్లే పరిస్థితి లేదని.. టీడీపీతో జనసేన మైత్రి గురించి వివరించాలని డిసైడ్ అయ్యారు. టీడీపీతో పొత్తు అంశం పైన ప్రతిపాదించేందుకు ఈ నేతలు సిద్దమైనట్లు తెలుస్తోంది. టీడీపీతో పొత్తు అవకాశం లేదని రాష్ట్ర నేతలు చెబుతున్న సమయంలో..పార్టీ అధినాయకత్వం మూడ్ తెలుసుకొనే ప్రయత్నం చేయనున్నారు. దీంతో, ఇప్పుడు ఈ సమావేశంపైన ఆసక్తి నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications