మా టికెట్స్‌ను డిసైడ్ చేసేందుకు పురందేశ్వరి భర్త ఎవరు..కన్నెర్ర చేసిన బీజేపీ సీనియర్స్..!

ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మరికొన్ని రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఫైనలైజ్ చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం ఈ సారి మాంచి కాక మీదున్నాయి. టీడీపీ-జనసేన-బీజేపీలు పొత్తుతో వస్తుండగా.. వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక బీజేపీ కూడా తమకు కేటాయించిన స్థానాల్లో అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తోంది. దీంతో ఆ పార్టీలో నేతలు నాయకులు రెండుగా చీలిపోయారు. రాష్ట్రంలో మరో రెండ్రోజుల్లో మోదీ పర్యటన ఉన్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీలో విబేధాలు తలెత్తడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది.

దగ్గుబాటి పురందేశ్వరి పై అసంతృప్తి : ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచే దగ్గుబాటి పురందేశ్వరిపై చాలామంది ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఎన్నికల వేళ ఈ వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. బీజేపీ ఒకప్పటి బీజేపీ కాదని ఇప్పుడు బీజేపీలో పసుపు రక్తం నిండిందని పార్టీలో ఎప్పటి నుంచో సేవలందిస్తున్న సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ జనసేనలతో బీజేపీ జతకట్టడాన్ని పలువురు బీజేపీ నాయకులే వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో టీడీపీలో కూడా ఈ పొత్తుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీజేపీ కేటాయించిన స్థానాల్లో అభ్యర్థుల ఖరారు విషయంలో పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు జోక్యం చేసుకుంటున్నారని ఇది సరైన పద్దతి కాదని పలువురు బీజేపీ నేతలు వాపోతున్నారు.

AP BJP leaders unhappy over Purandeshwari in allocating tickets says husband intervention unacceptable

దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎవరు : అంతేకాదు టికెట్ కేటాయింపుల్లో భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయంటూ రాష్ట్ర బీజేపీ క్యాడర్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అర్హులైన వారికి కాకుండా ఎవరికో టికెట్లు కేటాయించడాన్ని ఇటు నేతలు క్యాడర్ జీర్ణించుకోలేకున్నారు. ఈ విషయాన్ని బీజేపీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లామని వారు చెబుతున్నారు. టికెట్ కేటాయింపుల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు జోక్యం ఏంటని వారు సీరియస్‌గా ప్రశ్నిస్తున్నారు. కొంతమంది బీజేపీ నేతలైతే తమకు టికెట్ వస్తే చాలని ఆ తర్వాత టీడీపీ జనసేన క్యాడర్ తమను గెలిపించుకుంటుందనే భావనలో ఉన్నారని పురందేశ్వరి వ్యతిరేక వర్గం వాదిస్తోంది.

AP BJP leaders unhappy over Purandeshwari in allocating tickets says husband intervention unacceptable

బీజేపీ సీనియర్స్ కనిపించడం లేదా : ఇక టికెట్ కేటాయింపుల విషయానికొస్తే బీజేపీ అభ్యర్థులు ఎవరి పోటీ చేయాలనేదానిపై టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్ట్ చేస్తున్నారని ఆమేరకే టికెట్ కేటాయింపులు జరుగుతున్నాయని తీవ్ర స్థాయిలో బీజేపీ సీనియర్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. విజయవాడ బరిలో ప్రముఖ పారిశ్రామికవేత్త పీవీపీ, తిరుపతి ఆదికేశవులు కూతురుకు సీటు కేటాయించేందుకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చొరవ చూపుతున్నారని దీనివెనుక భారీగా డబ్బులు చేతులు మారి ఉంటాయనే అనుమానాన్ని వారు వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ సీనియర్ నాయకులైన సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, విశాఖ లోక్‌సభ స్థానం ఆశించి గత కొన్ని నెలలుగా అక్కడే పనిచేస్తున్న జీవీఎల్, కామినేని, హనుమంతలు ఎక్కడా అని బీజేపీ క్యాడర్ ప్రశ్నిస్తోంది.

మొత్తానికి పురందేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి టీడీపీ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని కమలనాథులు ఆరోపిస్తున్నారు. బీజేపీ పార్టీకి ఎప్పటి నుంచో సేవలందిస్తున్న వారిని కాదని కొత్తగా వచ్చిన వారికి టికెట్లు కేటాయిస్తే వారికి సహకరించేది లేదంటూ బీజేపీ క్యాడర్‌తో పాటు బీజేపీలోని పురందేశ్వరి వ్యతిరేక వర్గం హెచ్చరిస్తోంది. పురందేశ్వరిపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+