పవన్ కల్యాణ్, నల్లారి.. ఇద్దరిదీ ఒకే మాట!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత భారతీయ జనతాపార్టీ ఢిల్లీ పెద్దలు ఏపీపై దృష్టిసారించబోతున్నారు. కర్ణాటకలో వచ్చిన ఫలితాలనుబట్టి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఢిల్లీలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే తప్పనిసరిగానైనా రాష్ట్రంపై వారికి దృష్టిసారించాల్సిన అవసరం ఏర్పడుతోంది. తాజాగా పార్టీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హస్తినాపురంలోనే ఉన్నారు. పార్టీ నేతలతో జోరుగా రాజకీయ కార్యకలాపాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.
పవన్ మనసులో మాట:జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాదెండ్ల మనోహర్ తో కలిసి ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి వెళ్లారు. ఆ సమయంలో తన మనసులోని మాటను వారిదగ్గర కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీతో కలిసి వెళితే సానుకూల ఫలితాలు వస్తాయని, టీడీపీని పక్కనపెట్టి పోరాటం చేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని, అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశంగా మారుతుందని చెప్పినట్లు తెలుస్తోంది. పొత్తు పెట్టుకుంటే వచ్చే లాభాలు, పెట్టుకోకపోతే కలిగే నష్టాల గురించి పవన్ వివరంగా చెప్పారని, తాను చెప్పినవాటికి మద్దతుగా కొన్ని సర్వే సంస్థల నివేదికను కూడా సమర్పించినట్లు సమాచారం.

'కర్ణాటక' ముగిసిన తర్వాతే?: రాష్ట్రంలో మెజారిటీ బీజేపీ నేతలు తెలుగుదేశం పార్టీతో పొత్తుద్వారా ఎన్నికలకు వెళ్లడమే మంచిదని చెబుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా పార్టీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచన కూడా అదే అంటున్నారు. అయితే టీడీపీతో పొత్తుకు సోము వీర్రాజు ససేమిరా అంటున్నారు. అందుకు కారణాలను కూడా ఆయన పార్టీ పెద్దలకు స్పష్టంగా వివరించారు. పవన్ కల్యాణ్ ప్రతిపాదనలను సోము వీర్రాజుతో చర్చించారా? ఆయన అభిప్రాయం తీసుకుంటారా? లేదంటే సోము మాటకు విరుద్ధంగా పొత్తలపై నిర్ణయం తీసుకుంటారా? అనేది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాతే తేలనుంది. అప్పటివరకు ఎదురుచూడటమే.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications