లక్షల కోట్ల నిధులిచ్చాం..ఏం చేశారు: చీప్ లిక్కర్ రేటును పెంచడం భారం కాదా: సోము వీర్రాజు
అమరావతి: పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విలువ ఆధారిత పన్నును తగ్గించకపోవడం పట్ల రాజకీయ రచ్చ మరింత ముదురుతోంది. తెలుగుదేశం పార్టీ ఒకవంక దీనిపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోండగా.. భారతీయ జనతా పార్టీ కూడా దాడికి దిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ప్రజల మీద భారాన్ని తగ్గించిందని, ఆ పని జగన్ సర్కార్ ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తోంది.

మోడీ ప్రధానిగా ఉండటం వల్లే..
నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండటం వల్లే దేశ రక్షణ వ్యవస్థ బలోపేతమైందని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఒకవైపు దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తూనే.. ఆర్థిక రంగాన్ని కూడా పట్టాలెక్కించారని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖజానా మీద ఎంతో భారం పడినప్పటికీ.. ఉచితంగా కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను దేశ ప్రజలకు అందజేస్తోందని అన్నారు. అయినప్పటికీ.. ప్రజల మీద పడిన పెట్రోల్, డీజిల్ భారాన్ని తమ ప్రభుత్వం తగ్గించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అదే రకంగా ఎందుకు సానుకూలంగా స్పందించట్లేదని ప్రశ్నించారు.

చీప్ లిక్కర్ రేటు ఎందుకు పెంచారు?
పెట్రోల్, డీజిల్ ధరలను తమ ప్రభుత్వం పెంచిందని చెబుతోన్న వైఎస్ఆర్సీపీ నాయకులకు తమ ప్రభుత్వం పెంచిన మద్యం రేట్లు గుర్తుకు రాలేదా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. 50 రూపాయలు ఉండే చీప్ లిక్కర్ రేటును 250 రూపాయలకు పెంచారని గుర్తు చేశారు. ఇది భారం కాదా అని నిలదీశారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్, సేల్స్ ట్యాక్స్ తగ్గించమని తాము డిమాండ్ చేస్తే.. వెటకారం చేస్తారా? అని ప్రశ్నించారు. ట్యాక్స్ తగ్గించమన్నందుకు రాజకీయ పార్టీ నేతలను కూడా కొట్టే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.

తోకపార్టీలంటారా?
బీజేపీని తోక పార్టీగా వైసీపీ నాయకులు అభివర్ణించడాన్ని సోము వీర్రాజు తప్పు పట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామని, 18 రాష్ట్రాల్లో ప్రభుత్వం తమదేనని, 2024లో ఏపీలోనూ అధికారంలోకి రాబోతోన్నామని.. అలాంటి పార్టీని తోకపార్టీగా చెప్పడాన్ని వైసీపీ నాయకులు దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. బద్వేలు ఉప ఎన్నికలో టీడీపీ సహకారం తీసుకున్నామనడంలో అర్థం లేదని చెప్పారు. ఒక్క జనసేనతో తప్ప తమకు మరే ఇతర పార్టీతోనూ పొత్తు లేదని తేల్చి చెప్పారు.

లక్షల కోట్ల నిధులిచ్చాం..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయలను మంజూరు చేసిందని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటోన్న అన్ని రకాల అభివృద్ది పనులు కేంద్రంలోని తమ పార్టీ ప్రభుత్వం చలవేనని స్పష్టం చేశారు. విజయవాడలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్లను నిర్మించింది కేంద్ర ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. స్మార్ట్ సిటీలు, అమృత్ సిటీలతో కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించిందని చెప్పారు.
Recommended Video

మండల స్థాయిలో ప్రచారం..
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందనే విషయంపై విస్తృతంగా ప్రచారం చేస్తామని సోము వీర్రాజు అన్నారు. నియోజకవర్గం, మండల స్థాయిలో కరపత్రాలను పంచి పెడతామని చెప్పారు. జగన్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రజాందోళనలను నిర్వహిస్తామని అన్నారు. ఆ భయంతోనే మంత్రులు, వైసీపీ నాయకులు స్పందిస్తున్నారని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. పెట్రోల్, గ్యాస్‌ను ఎక్కడి నుంచో విదేశాల నుంచి తీసుకుని రావాల్సి ఉంటుందని, ఇక్కడే తయారయ్యే చీప్ లిక్కర్ రేటును వైసీపీ పెంచట్లేదా? అని ప్రశ్నించారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
వాహనదారులకు కేంద్రం భారీ ఉపశమనం? -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!!












Click it and Unblock the Notifications