రాజధాని తరలింపు నిర్ణయం వాయిదా : అఖిలపక్షం..అసెంబ్లీ తరువాతనే: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!
ఏపీ రాజధాని పైన ప్రభుత్వం నిర్ణయం వాయిదా వేసింది. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో రాజధాని తరలింపు పైన కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రచారం సాగింది. అయితే, చివరి నిమిషంలో సీఎం జగన్ తన వ్యూహం మార్చుకున్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికపైన చర్చించారు. కానీ, తుది నిర్ణయం తీసుకోలేదు. జీఎన్ రావు కమిటీ సిఫార్సుల పైన విమర్శలు వస్తున్న పరిస్థితుల్లో..ఏకపక్షంగా ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకోకూడదని సీఎం జగన్ అభిప్రాయ పడ్డారు.
దీంతో..తాను సభలో ప్రకటించిన విధంగా రెండో కమిటీ బీసీజీ నివేదిక సైతం వచ్చిన తరువాత దీని పైన చర్చించి తుది నిర్ణయం తీసుకుందామంటూ ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. జనవరి 3న ఈ కమిటీ తుది నివేదిక రానుంది. ఆ తరువాత అఖిలపక్షం.. జనవరి మూడో వారంలో అసెంబ్లీ ఈ అంశం పైన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అందులోనే రాజధాని తరలింపు పైన తుది నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ లో నిర్ణయించారు.

టేబుల్ ఐటమ్ గా జీఎన్ రావు కమిటీ రిపోర్ట్..
పది రోజులుగా ఏపీలో హాట్ టాపిక్ గా మారిన రాజధాని మార్పు పైన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీని పైన మంత్రుల నుండి ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయం తీసుకున్నారు. అదే సమయంలో తాను శాసనసభలో చేసిన ప్రకటనను ప్రస్తావించారు. జీఎన్ రావు కమిటీతో పాటుగా బీసీజీ నివేదిక వచ్చిన తరువాత దానిని కూడా పరిశీలించి..అఖిలపక్షం అదే విధంగా అసెంబ్లీలో చర్చ చేసిన తరువాత తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి ప్రతిపాదించగా..మంత్రులు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలుస్తోంది. బీసీజీ నివేదిక అందిన తరువాత అఖిలపక్ష సమావేశం..ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో..జనవరి మూడో వారంలో మాత్రమే రాజధాని తరలింపు పైన నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.

అమరావతి పై హైపవర్ కమిటీ..
రాజధాని తరలింపు పైన అక్కడి రైతులు...స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లొ వారితో సంప్రదింపుు..అక్కడ చేపట్టాల్సిన చర్యల పైన అధ్యయనం కోసం హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. మంత్రులతో పాటుగా అధికారులతో కలిపి ఈ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాజధాని తరలింపు పైన అసెంబ్లీలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుం దామంటూ ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. అయితే, ఇప్పటికే ప్రభుత్వం తీసుకుందనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నారని..మరింత ఆలస్యం చేయటం ద్వారా కాలయాపన అంటూ ఇద్దరు సీనియర్ మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేయగా.. ముఖ్యమంత్రి వారిని వారించినట్లుగా సమాచారం. జనవరి మూడో వారంలో తుది నిర్ణయం తీసుకుందామంటూ సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

జనవరి మూడో వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
ఇక..ఇప్పటికే మధ్యంతర నివేదిక ఇచ్చిన బోస్టన్ కంపెనీ జనవరి 3వ తేదీ నాటికి పూర్తి స్థాయి నివేదిక ఇస్తామని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.దీంతో..ఆ నివేదిక వచ్చిన తరువాత మరో సారి కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఆ వెంటనే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి..సమావేశాల్లో కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో..రాజధాని మార్పు అంశం నిర్ణయం ప్రస్తుతానికి వాయిదా పడింది. ఇక, హైకోర్టు ఏర్పాటు బెంచ్ ల ఏర్పాటు పైన కేబినెట్ లో కొందరు మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.
-
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications