వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నిక‌ల వ‌రాలు : రైతుల‌కు ప‌దివేలు : డ‌్వాక్రా మ‌హిళ‌ల‌కు స్మార్ట్ ఫోన్లు..!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల వేళ దాదాపు గా చివ‌రి స‌మావేశంగా భావిస్తున్న ఏపి మంత్రివ‌ర్గం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. తాజాగా బ‌డ్జె ట్ లో ప్ర‌తిపాదించిన అన్న‌దాత సుఖీభ‌వ విధి విధానాల‌ను ఖ‌రారు చేసింది. ఏడాదికి ప‌ది వేలు చొప్పున రైత‌లుకు ఈ ప‌ధ కం ద్వారా ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ఇక‌, డ్వాక్రా మ‌హిళ‌ల‌కు స్మార్ట్ ఫోన్లు..మూడేళ్ల పాటు క‌నెక్టివిటీ ఇవ్వాల‌ని క్యాబినెట్ నిర్ణ‌యించింది.

రైతుల‌కు ప‌ది వేలు..

రైతుల‌కు ప‌ది వేలు..

రాష్ట్ర క్యాబినెట్ స‌మావేశంలో అన్నదాత సుఖీభవ పథకం విధివిధానాలపై చర్చించారు. ప్రతి రైతు కుటుంబానికి కేం ద్రం ఇచ్చేదానితో కలిపి రూ.10వేలు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఖరీఫ్‌, రబీలో రెండు దఫా లుగా ఒక్కో సీజన్‌కు రూ.5 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఫిబ్రవరి చివరలోనే అన్నదాత సుఖీభవ చెక్కుల పంపిణీ, రైతు రుణ మాఫీ చెల్లింపులు కూడా త్వరగా చేపట్టాలని.. కుటుంబానికి రూ.10వేలు ఇస్తే మొత్తంగా రూ.7,621కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు వివ‌రించారు. అలాగే వచ్చే ఖరీఫ్ నుంచి కౌలు రైతులను కూడా ఆదుకునేలా మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయించారు. కేంద్రం పథకంలో అనేక ఆంక్షలు ఉన్నాయని.. 5 ఎకరాల లోపు వారే అర్హులుగా, మూడు వాయిదాలలో చెల్లించే విధంగా, కొందరికే ఇచ్చి మిగిలిన రైతులను వదిలేసిందని, కానీ తాము రైతులు అందరికీ ఇస్తున్నామని క్యాబినెట్ త‌రువాత మంత్రి సోమిరెడ్డి స్ప‌ష్టం చేసారు.

డ్వాక్రా మ‌హిళ‌ల‌కు స్మార్ట్ ఫోన్లు..

డ్వాక్రా మ‌హిళ‌ల‌కు స్మార్ట్ ఫోన్లు..

క్యాబినెట్ స‌మావేశంలో మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే డ్వాక్రా మ‌హిళ‌ల‌కు పసుపు - కుంకుమ కోసం ప‌ది వేలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన ప్ర‌భుత్వం తాజాగా డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు, సిమ్ కార్డుతోపాటు మూడేళ్ల పాటు కనెక్టివిటి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. అలాగే అమరావతిలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు 30 ఎకరాలు కేటాయింపు, ఎకరాకు రూ.10 లక్షల చొప్పున 30 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయించారు. కాగా.. తొలి విడత రూ. కోటి సీఆర్డీఏకు చెల్లిస్తే సొసైటీకి భూమి బదలాయించేలా నిర్ణయించారు.

సచివాలయ ఉద్యోగులకు

సచివాలయ ఉద్యోగులకు

మిగతా మొత్తం రెండేళ్లలో సీఆర్డీఏకి చెల్లించేలా వెసులుబాటు కల్పిం చారు. అలాగే ఎన్జీఓలు, సచివాలయ ఉద్యోగులకు 175 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ.. చదరవు గజం రూ.4 వేల చొప్పున 230 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానించింది. ఇదే స‌మావేశంలో ఢిల్లీలో దీక్ష కు ప్ర‌భుత్వ ఖ‌ర్చు పైనా చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

English summary
AP Cabinet taken key decisions before elections. AP Govt decided to give farmer family. And also decided to give smart phones for DWACRA memebrs with three years connectivity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X