స్థానికత గుర్తింపులో మార్పు, మరో రెండు జోన్లు - ప్రభుత్వం కీలక నిర్ణయం..!!
విద్యార్ధుల స్థానికత గుర్తింపుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో మార్పులకు ఆమోదం లభించింది. జోన్ల వ్యవస్థలోనూ మార్పులు తీసుకొస్తూ నిర్ణయించారు. ఇప్పటి వరకు స్థానికత గుర్తింపుకు ఉన్న పదో తరగతి విద్యార్హతను ఏడో తరగతికి తగ్గించారు. దీని కారణంగా ఎక్కవ మందికి స్థానికుల కోట పరిధిలోకి చేరుతారు. వారికి ఉద్యోగ, ఉన్నత విద్య ప్రవేశాల్లో అవకాశాలు లభిస్తాయి.
స్థానికత విద్యార్హత తగ్గింపు:ఏపీ ప్రభుత్వం స్థానికత..జోన్లపైన చర్చించి మార్పులకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆరు నుంచి పదో తరగతి వరకు ఎక్కవ ఎక్కువ తరగతులు చదివారాన్న దాని పైన స్థానికత నిర్దారిస్తున్నారు. ఈ ప్రకారమే ఉద్యోగ నియామకాలు..ఉన్నత విద్యలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడటం..ఉన్నత విద్య కోసం బయట ప్రాంతాలకు విద్యార్దులు వెళ్లటం వల్ల స్థానికులే అయినప్పటికీ చాలామంది స్థానికేతులుగా గుర్తింపు పొందాల్సి వస్తోంది. దీనిని అధిగమించేందుకు పది నుంచి ఏడో తరగతి వరకు విద్యార్హత స్థాయిని తగ్గించటం వల్ల ఎక్కువ మందికి స్థానికుల కోటా పరిధిలోకి చేరుతారు. దీంతో, వారికి ఉద్యోగ, ఉన్న విద్య ప్రవేశాల్లో అవకాశాలు లభిస్తాయి.

రెండు జోన్లు - మల్టీ జోన్లు:ప్రస్తుతం జోన్ -1 కింద ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉన్నాయి. జోన్ -2 లో ఉమ్మడి గోదావరి, క్రిష్ణా ఉండగా, జోన్ -3లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఉన్నాయి. అదే విధంగా జోన్ -4 కింద చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ఉన్నాయి. తాజాగా రెండు జోన్లను అదనంగా పెంచటం వల్ల కొత్త జిల్లాలు జోనల్ వ్యవస్థలోకి వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు మల్టీ జోన్లు ఉన్నాయి. ఒక జోన్ కింద ఉమ్మడి ఆరు జిల్లాలు, మరో జోన్ కింద ఉమ్మడి ఏడు జిల్లాలు ఉన్నాయి. వీటికి అదనంగా మరో రెండు మల్టీ జోన్లు రానున్నాయి. దీని వలన ప్రాంతీయ కార్యాలయాలు అదనంగా వస్తాయి. స్థానిక, జోన్ల పెంపు పై కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంది. ఇది లాంచనప్రాయమే. తెలంగాణలోనే ఇదే విధంగా జరిగిందని అధికారులు గుర్తు చేస్తున్నారు.
మంత్రివర్గం ఆమోద ముద్ర:కేబినెట్ తాజాగా ఆమోదించిన ప్రభుత్వ సర్వీసులకు లోకల్ కేడర్స్ అండ్ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ డ్రాఫ్ట్ ఆర్డర్ -2023 మేరకు డిస్ట్రిక్ట్ కేడర్ గా టీచర్లు, జూనియర్ అసిస్టెంట్స్, వారి సమానస్థాయి ఉద్యోగులు ఉంటారు. జోనల్ కేడర్ గా జూనియర్ అసిస్టెంట్లు, ఆపైన ఉన్నవారు..మల్టీ జోన్ పరిధిలో సెకండ్ లెవల్ గెజిటెడ్ అదికారులు, డిప్యూటీ కలెక్టర్ స్థాయి వారు, స్టేట్ లెవల్ కేడర్ ఉద్యోగులంతా మల్టీ జోనల్ పరిధిలోకి (ఏపీ సెక్రటేరియట్, హెచ్ఓడీలు, రాష్ట్ర స్థాయి సంస్థలు, కేపిటల్ ఏరియాలో పోలీసు కమిషనరేట్ ను మినిహాయించి) వస్తారు. దీని వలన 95 స్థానం పోస్టులు స్థానికులకు లభిస్తాయి. దీంతో, ఈ నిర్ణయాల పైన మంత్రివర్గం చర్చించి ఆమోద ముద్ర వేసింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications