మంత్రులకు పిలుపు- కీలక నిర్ణయాల దిశగా సీఎం జగన్..!!

ఏపీలో ఎన్నికల దిశగా ముఖ్యమంత్రి జగన్ వేగంగా అడుగులు వేస్తున్నారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. తాజాగా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి..ఇప్పుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. గత కేబినెట్ సమావేశంలో ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని తేల్చేసిన సీఎం..ఉద్యోగుల సమస్యలకు అదే సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి సీఎం జగన్ మరోసారి మంత్రివర్గ సమావేశానికి నిర్ణయించారు.

ఈ నెల 12న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజెండా సిద్దం చేయాలని అన్ని శాఖల కార్యదర్శులకు సూచించారు. ఈ సమావేశంలో పాలనా పరంగా పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. ప్రధానంగా సంక్షేమ పథకాల్లో కొత్త లబ్దిదారులకు అవకాశం..వారికి ఆగస్టు నెల నుంచి లబ్ది అందేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయానికి అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు. ఉద్యోగ సమస్యలు క్లియర్ కావటంతో ఇక ఏపీలో ఉద్యోగాల భర్తీ పైన ప్రభుత్వం పోకస్ చేస్తోంది. ఏపీపీఎస్సీ ద్వారా కొత్త ఉద్యోగాల నియామకానికి సంబంధించిన నిర్ణయానికి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

jagan9

ఈ సమావేశంలో ప్రధానంగా మూడు రాజధానుల వ్యవహారం..విశాఖ నుంచి పాలన పైన చర్చించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. జూలై 11న సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణకు రానుంది. సుప్రీంలో తమకు అనుకూలంగా నిర్ణయం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే తీర్పుకు మాత్రం సమయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ నుంచి విశాఖలో పాలన ప్రారంభిస్తానని గతంలోనే సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పుడు మారుతున్న రాజకీయం..పొత్తులు..సర్వే నివేదికల ఆధారంగా సీఎం జగన్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభించటం పైన సీఎం జగన్ ఈ సమావేశంలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

ఎన్నికల ఏడాది కావటంతో సంక్షేమంతో పాటుగా అభివృద్ధి పైనా సీఎం జగన్ ఫోకస్ చేసారు. ఈ సమావేశంలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ లో జరిగిన ఒప్పందాల అమలు పైన తదుపరి కార్యాచరణ నిర్ణయించనున్నారు. దీంతో పాటుగా రాష్ట్రంలో ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్న దాడి..సమర్ధతంగా ఎదుర్కోవటంతో పాటుగా జగనన్న సురక్ష నిర్వహణ పైనా మంత్రులకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. మారుతున్న రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై క్యాబినెట్ మంత్రులతో ఆయన చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటన తరువాత ఏర్పాటు చేసిన మంత్రివర్గ సమావేశం కావటంతో ఈ సారి మంత్రి వర్గ సమావేశం పైన ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+