పితానికి పదవిపై ఫైర్: రిజైన్ చేసి పార్టీ పెడ్తానని చింతమనేని, బండారు ఫోన్ స్విచ్ఛాఫ్
అమరావతి: పితాని సత్యనారాయణకు మంత్రి పదవి ఇవ్వడంపై టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండగా టిడిపి కార్యకర్తలపై కేసులు పెట్టించారని, అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
రాజీనామా ప్రకటించిన చింతమనేని
మంత్రి పదవి టిడిపిలో చిచ్చు పెడుతోంది. బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి, బోండా ఉమ తదితరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. చింతమనేని ప్రభాకర్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నరు.
తనకు మంత్రి పదవి రాకపోవడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. తాను రాజీనామా చేస్తానని చెప్పారు. అయితే, పార్టీ మారనని, కొత్త పార్టీ పెడతానని చెప్పారు. పార్టీ మారి కార్యకర్తలను అవమానించలేనని చెప్పారు.

రాజీనామా యోచనలో దూళిపాళ్ల
దూళిపాళ్ల నరేంద్ర రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ఆయన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అయిదుసార్లు గెలిచిన దూళిపాళ్లకు మంత్రి పదవి ఇవ్వకపోవడం ఏమిటని ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఉండవద్దని దూళిపాళ్లకు చెబుతున్నారు.
ఫోన్ స్విచ్చాఫ్ చేసిన బండారు సత్యనారాయణ మూర్తి
కేబినెట్‌లో అవకాశం దక్కకపోవడంతో పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి మనస్తాపం చెందారు. ఎమ్మెల్యే కూడా అందుబాటులో లేరు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు, కార్యకర్తల ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని జిల్లా నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళతామన్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications