ఢిల్లీలో కొత్త లెక్కలు - సీఎం జగన్ అలర్ట్, మంత్రులతో కీలక భేటీ..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తరువాత కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఇటు సీఎం జగన్ వై నాట్ 175 నినాదంతో ఎన్నికల బరిలోకి దిగారు. అటు ఏపీ లో తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో కొత్త అంచనాలు మొదలయ్యాయి. ఈ సమయంలోనే తన మంత్రివర్గ సహచరులతో సీఎం జగన్ భేటీ కానున్నారు. పాలనా పరంగా..రాజకీయంగా కీలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు.
ఎన్నికల కసరత్తులో : ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ఎన్నికల సమరశంఖం పూరించారు. పార్టీ నేతలకు ఎన్నికల కార్యాచరణ నిర్దేశించారు. ఆరోగ్య సురక్ష..బస్సు యాత్రల ద్వారా పార్టీ కేడర్ అంతా ప్రజల్లోనే ఉండాలని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో తన సంక్షేమ ఓట్ బ్యాంక్ ను మరింత బలోపేతం చేసుకొనే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి 1 నుంచి పెన్షన్ రూ 2,750 నుంచి రూ 3,000కు పెంచనున్నారు.

అదే విధంగా పలు పథకాలను జనవరి నుంచి ఫిబ్రవరి వరకు అమలు చేసేలా షెడ్యూల్ సిద్దం చేసారు. మార్చిలో ఎన్నికలు జరుగుతాయనే అంచనాలతో సిద్దం అవుతున్నారు. ఈ సమయంలో ప్రతిపక్షాలు సీఎం జగన్ లక్ష్యంగా ఒక్కటయ్యాయి. చంద్రబాబు అరెస్ట్ తరువాత రాజకీయ లెక్కల్లో మార్పు కనిపిస్తోంది. దీంతో, మంత్రులతో కీలక భేటీకి సీఎం జగన్ నిర్ణయించారు.
పాలనా పరమైన నిర్ణయాలు : ఈ నెల 31న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. గత అసెంబ్లీ సమావేశాల ముందు ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సారి సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులతో పాటుగా పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం.
అదే విధంగా 2019 ఎన్నికల మేనిఫెస్టోలో అమలు చేసిన హామీలు..పెండింగ్ అంశాల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమావేశంలో మద్యం, ఇసుక పాలసీలకు సంబంధించి చర్చ చేయటంతో పాటుగా ప్రతిపక్షాల ఆరోపణలకు వేళ..ప్రభుత్వం ఈ రెండు విధానాల్లోనూ మార్పుల దిశగా కీలక నిర్ణయాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

రాజకీయ దిశా నిర్దేశం : ఇక, విశాఖ నుంచి పాలన పైన ఈ సమావేశంలోనూ సీఎం జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. దసరా నుంచే విశాఖలో పాలన ప్రారంభించాలని భావించినా..డిసెంబర్ నుంచి మొదలు పెట్టాలని తాజాగా నిర్ణయించారు. ఇక, తాజాగా ఢిల్లీలోనూ రాజకీయంగా లెక్కలు మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణలో బీజేపీ, జనసేన మైత్రి..ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసే విధంగా జరుగుతున్న ప్రయత్నాలను వైసీపీ నిశితంగా గమనిస్తోంది. దీంతో, ప్రతిపక్షాల రాజకీయ వ్యూహాలకు ధీటుగా ముందుకు వెళ్లేందుకు కార్యాచరణ సిద్దం చేస్తోంది. చంద్రబాబు అరెస్ట్..సానుభూతి కూడగట్టే క్రమంలో భువనేశ్వరి తాజాగా యాత్రకు సిద్దం కావటంతో..రాజకీయ అంశాల పైన ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చ..నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications