ఉద్యోగులకు ఐఆర్, రుణమాఫీ - సీఎం జగన్ వరాలు, ముహూర్తం ఖరారు..!?
ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఏ ఒక్క అవకాశం లేకుండా చేయాలనేది సీఎం జగన్ లక్ష్యం. ప్రతిపక్షాలు పొత్తులతో జగన్ ఓటమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే అభ్యర్దుల మార్పుల పైన సీఎం జగన్ కసరత్తు తుది దశకు చేరింది. ఈ నెల 27 నుంచి జిల్లాల పర్యటనలకు సీఎం జగన్ నిర్ణయించారు. ఇక, ఎన్నికల వేళ వరాల ప్రకటన దిశగా ఈ నెల 31న మంత్రివర్గ సమావేశం జరగనుంది.
కీలక మంత్రివర్గ భేటీ : ముఖ్యమంత్రి జగన్ ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఈ నెల 27న భీమిలిలో భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొంటున్నారు. ఈ నెల 30న ఏలూరు కేంద్రంగా రెండో సభకు నిర్ణయించారు. ఈ నెల 31న పాలనా పరంగా కీలక నిర్ణయాల దిశగా మంత్రివర్గ సమావేశానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికలకు సిద్దం అవుతన్న వేళ ఈ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు..ఎన్నికల వరాలు ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు. వచ్చే నెల 20 తరువాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో, ఫిబ్రవరి 12వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల తరువాత ఏపీ బడ్జెట్ కు తుది రూపు ఇవ్వనున్నారు.

ఎన్నికల వరాలు : ఈ సారి మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల వరాలకు ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. డీఎస్సీ నిర్వహణ పైన ఈ సమావేశంలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఉద్యోగులకు కొత్త పీఆర్సీ పైన ప్రభుత్వం ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఇచ్చేందుకు మరింత సమయం అవసరం. ఈ లోగా ఉద్యోగులకు ఐఆర్ (మధ్యంతర భృతి) ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. దీని పైన ఉద్యోగ సంఘాలతోనూ ప్రభుత్వం చర్చలు చేపట్టనున్నట్లు సమాచారం. ఇక, రైతులకు రుణమాఫీ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు అధికర వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. 2019 ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేయటంతో..కొత్త హామీల విషయంలోనూ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిర్ణయాల పై ఆసక్తి : దీంతో..ఈ సారి మంత్రివర్గ సమావేశంలో రైతు రుణమాఫీ దిశగా నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే విధంగా పార్టీ పరంగానూ ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు సాధ్యాసాధ్యాల అమలు పైనా ప్రభుత్వం నివేదిక సేకరించింది. దీని పైన నిర్ణయం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇక, రాజకీయంగా మంత్రులకు సీఎం జగన్ కీలక దిశా నిర్దేశం చేసే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరిలో ప్రభుత్వం చేయూత, జగనన్న కాలనీల ప్రారంభం పైన నిర్ణయం తీసుకోన్నారు. ఎన్నికల వేళ నిర్వహిస్తున్న సమావేశం కావటంతో ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలకు ఆమోద ముద్ర వేస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications