జగన్‌కు కేంద్రం కీలక హామీ: మళ్లీ ఢిల్లీకి?: మంత్రివర్గ సమావేశం వాయిదా వెనుక..!!

అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 29వ తేదీన మంత్రివర్గం సమావేశం కావాల్సి ఉంది. ఈ మేరకు అన్ని శాఖలకు సాధారణ పరిపాలన మంత్రిత్వ శాఖ నుంచి సమాచారం వెళ్లింది. దీనికి సంబంధించిన సర్కులర్‌ను జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టిన వెంటనే మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Recommended Video

    చంద్రబాబును జూనియర్ ఎన్టీఆర్ తన్ని, తరిమేస్తాడేమో *Politics | Telugu OneIndia
    సెప్టెంబర్ 1కి వాయిదా..

    సెప్టెంబర్ 1కి వాయిదా..

    ఇప్పుడు తాజాగా ఈ భేటీని వాయిదా వేసింది ప్రభుత్వం. సెప్టెంబర్ 1వ తేదీన సమావేశం కావాలని నిర్ణయించింది. 1వ తేదీన ఉదయం 11:30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమౌతుంది. వైఎస్ జగన్ ఇటీవలే ఢిల్లీలో పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కే సింగ్‌తో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల బకాయిలు, పోలవరం ప్యాకేజీ, తెలంగాణ నుంచి రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ బకాయిల గురించి ప్రస్తావించారు.

    పోలవరం ప్యాకేజీ హామీ..

    పోలవరం ప్యాకేజీ హామీ..

    ఆయా అంశాలన్నింటినీ వైఎస్ జగన్- మంత్రులకు వివరిస్తారు. పోలవరం ప్యాకేజీ విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ప్రభుత్వం చెబుతోంది. పోలవరం ఆర్ఆర్ ప్యాకేజీ కింద నిర్వాసితులకు చెల్లించడానికి సుమారుగా 20 వేల కోట్ల రూపాయల నిధులు అవసరమౌతాయంటూ స్వయంగా ముఖ్యమంత్రే బహిరంగంగా చెప్పారు. ఇవే ప్రతిపాదనలను ప్రధానికీ సమర్పించారు. దీని పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించింది. ప్యాకేజీ విడుదలకు హామీ ఇచ్చింది.

    మళ్లీ ఢిల్లీకి..

    మళ్లీ ఢిల్లీకి..


    పోలవరం నిధుల మంజూరు పట్ల ప్రధాని సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో- మరోసారి ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుందని వైఎస్ జగన్ భావిస్తోన్నారు. ఈ నెల చివర్లో ఆయన మరోసారి ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా పోలవరం ఆర్ఆర్ ప్యాకేజీ కింద 20 వేల కోట్ల రూపాయల మొత్తాన్ని కేంద్రం మంజూరు చేయకపోయినప్పటికీ.. సంతృప్తికరమైన ప్యాకేజీ లభిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

     అందుకే వాయిదా..

    అందుకే వాయిదా..

    ఈ నెల చివర్లో మరోసారి ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితులు రావొచ్చనే ఉద్దేశంతోనే మంత్రివర్గ సమావేశాన్ని సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేశారని సమాచారం. సెప్టెంబర్ రెండు లేదా వారంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన తేదీలను మంత్రివర్గ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. గడప గడపకు మన ప్రభుత్వం, గ్రామ/వార్డు సచివాలయాలు, ఎమ్మెల్యేల పనితీరు వంటి అంశాలు కేబినెట్ భేటీలో చర్చకు వస్తాయని చెబుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+