అమరావతికి తాజా హెచ్చరిక

Earthquake: భూకంపం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. అయినప్పటికీ జనం భయంకపితులయ్యారు. ఇళ్ల నుంచి బయటికి పరుగులు పెట్టేలా చేసింది. చాలాసేపటి వరకు రోడ్ల మీదే గడిపారు. ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు.

ములుగు కేంద్రం..

తెలంగాణలోని ములుగు జిల్లాలో ఈ ఉదయం 7:27 నిమిషాలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలు‌పై 5.3గా రికార్డయింది. ఉపరితలం నుంచి 40 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ తెలిపింది.

AP capital city Amaravati comes under the earthquake zone-3

కంపించిన భూమి..

అదే సమమయంలో ఏపీ, తెలంగాణల్లో ఈ భూప్రకంపనలు సంభవించాయి. కొన్ని చోట్ల రెండు సెకెన్ల పాటు భూమి ప్రకంపించింది. మరికొన్ని ప్రాంతాల్లో 3 నుంచి 4 సెకెన్ల పాటు ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. దాదాపుగా ఒకే సమయంలో వేర్వేరు నగరాలు, పట్టణాల్లో భూమి ప్రకంపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

హైదరాబాద్, విజయవాడ సహా..

ఏపీలో కృష్ణా జిల్లాలో భూమి కంపించింది. విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెంలల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. ఇక్కడ దీని తీవ్రత రెండు సెకెన్ల పాటు కొనసాగింది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి సహా వేర్వేరు జిల్లాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి.

ఉత్తర తెలంగాణలో..

వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో దీని తీవ్రత 3 నుంచి 4 సెకెన్ల పాటు కనిపించింది. హన్మకొండ, ఖమ్మం, మణుగూరు, గోదావరి ఖని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, భద్రాచలంలల్లో భూమి ప్రకంపించింది. దీని తీవ్రత ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం రికార్డయింది.

జనం భయభ్రాంతులు..

ఊహించని విధంగా ఈ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కట్టుబట్టలతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటికి పరుగులు తీశారు. సురక్షిత ప్రదేశాలకు చేరుకున్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు.

నాలుగు జోన్లుగా..

దేశంలో సెస్మిక్ యాక్టివిటీలను నాలుగు జోన్లుగా విభజించింది నేషనల్ జాగ్రఫికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5గా కేటగిరీ చేసింది. ఇందులో జోన్ 5లో సంభవించే భూకంపాల తీవ్రత గరిష్ఠ స్థాయిలో ఉంటుంది. ప్రాణ, ఆస్తినష్టం అత్యధికంగా నమోదవుతుంటుంది.

జోన్ 2లో తెలంగాణ..

జోన్ 2 సంభవించే వాటిని ప్రకంపనలుగా గుర్తిస్తుంటారు. తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా జోన్ 2 పరిధిలోకి వస్తుంది. అలాంటి తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ములుగు కేంద్రంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రకంపనలు తాజాగా నమోదయ్యాయి.

జోన్ 3లో రాజధాని..

ఏపీలో రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం కూడా సెస్మిక్ జోన్ 3 పరిధిలో వస్తుంది. ఓ మోస్తరు భూకంపం ఇక్కడ సంభవించే అవకాశాలు లేకపోలేదీ రీజియన్‌లో. అమరావతి ప్రాంత పరిధిలో గరిష్ఠ స్థాయిలో రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో భూకంపం సంభవించే ప్రమాదం లేకపోలేదని ఎన్జీఆర్ఐ చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+