అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విభజన తర్వాత 'అమరావతి'-గౌతమీపుత్ర శాతకర్ణి.. కాకతీళీయమే: దేవుడికి తెలుసు

ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో వేడుకలో నవ్యాంధ్ర రాజధాని అమరావతి, ఏపీ సీఎం చంద్రబాబు పైన ప్రశంసలు కురిశాయి.

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో వేడుకలో నవ్యాంధ్ర రాజధాని అమరావతి, ఏపీ సీఎం చంద్రబాబు పైన ప్రశంసలు కురిశాయి. దర్శకులు బోయపాటి శ్రీను, క్రిష్‌లు చంద్రబాబును ఆకాశానికెత్తారు.

రూ.1,981 కోట్ల చెక్కు చంద్రబాబు చేతికి, సుజనా చౌదరి చొరవ అన్న ఉమారూ.1,981 కోట్ల చెక్కు చంద్రబాబు చేతికి, సుజనా చౌదరి చొరవ అన్న ఉమా

విభజన తర్వాత ఏపీ రాజధాని అమరావతి కావడం, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తీయడం అంతా కాకతీళీయం అని పలువురు అన్నారు.

gautamiputra satakarni

మందుపాత్ర తలొంచింది: బోయపాటి

మందుపాతర కూడా చంద్రబాబు సంకల్పం ముందు తలవంచిందని ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను అన్నారు. 2003లో చంద్రబాబు మందుపాతర ఘటనలో ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే.

ఓ రాజ్యం నిర్మించాలంటే, ఓ రాజధానిని నిర్మించాలంటే ఆలోచన ఉండాలని, అలాంటి వారినే భగవంతుడు ఎన్నుకుంటారని, అలా వెంకటేశ్వర స్వామి ముఖ్యమంత్రి చంద్రబాబును ఎంచుకున్నారని చెప్పారు. రాజధానిని నిర్మించే సర్వశక్తులు చంద్రబాబుకు ఉన్నాయనే దేవుడు ఆయనను ముఖ్యమంత్రిగా చేశారన్నారు. చంద్రబాబు ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు.

చంద్రబాబు ఏపీని మొదటి రాష్ట్రంగా నిలబెడతారు

మనకందరికీ సహనం ఉంటే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో మొదటి రాష్ట్రంగా నిలబెడతారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నలభై ఏళ్ల పాటు ప్రజా సమస్యల పైన మడమ తిప్పలేదన్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి నాడు అమరావతిని పాలించారని, అది తెలిసేందుకే ఈ సినిమా చేస్తున్నారని, మన రాజధాని చరిత్ర అందరికీ తెలియాలన్నారు.

బాబుకు ఊరట, జగన్‌కు మింగుడుపడని 'భూమా'!బాబుకు ఊరట, జగన్‌కు మింగుడుపడని 'భూమా'!

అంతా కాకతాళీయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక అమరావతి రాజధాని కావడం, ఎప్పుడో గౌతమీపుత్ర శాతకర్ణి హయాంలో అమరావతి రాజధాని కావడం, ఇప్పుడు చంద్రబాబు అమరావతిని రాజధానిగా చేయడం అంతా కాకతాళీయం అని దర్శకులు క్రిష్ అన్నారు.

అమరావతి కడుతున్నారని సినిమా తీయలేదు: బాలయ్య

నూతనంగా ఏర్పడిన అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు అహర్నిషలు కృషి చేస్తున్నారని నందమూరి బాలకృష్ణ అన్నారు. అమరావతిని రాజధానిగా చేయడం చంద్రబాబు సంకల్పమని, అలాగే ఇప్పుడు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తీయడం.. అంతా కాకతాళీయం అన్నారు. అమరావతి కడుతున్నారని ఈ సినిమా తీయలేదన్నారు. అంతా అలా జరిగిపోయిందన్నారు.

balakrishna

సినిమా వాళ్ల సంగతి తెలుసు: వెంకయ్య

తనకు సినిమా వాళ్ల సంగతి తెలుసుని, కానీ సినిమాల గురించి తెలియదని వెంకయ్య నాయుడు అన్నారు. సినిమా వాళ్ల సంగతి అంటే, వారి గురించి తెలుసునని చెప్పారు. చంద్రబాబు ఈ సినిమా ఫంక్షన్‌కు రావడానికి.. బాలయ్యకు వియ్యంకుడు కావడం కారణం కావొచ్చన్నారు.

కానీ తాను రావడానికి వేరే కారణం ఉందన్నారు. ఒకటి తాని సమాచార మంత్రిని అన్నారు. మరో కారణం ఓ గొప్ప తెలుగు వ్యక్తి అయిన శాతకర్ణి గురించి సినిమా కాబట్టి వచ్చానని చెప్పారు.

బాలకృష్ణ అడగగానే తాను వస్తానని చెప్పానని వెంకయ్య అన్నారు. 16వ తేదీన ప్రధాని మోడీతో సమావేశం కారణంగా రాలేకపోయానని చెప్పారు. చంద్రబాబు వియ్యంకుడు కాబట్టి వచ్చాడన్నారు.

తెలుగు వెలుగులు దేశంలో, ప్రపంచంలో చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని అలాంటి వ్యక్తి తనయుడు బాలయ్య అని వెంకయ్య చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పునాదులను కూకటివెళ్లతో పెకిలించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. రాజకీయాలకు ఇది సందర్భం కాదని, కానీ ఏపీని కాంగ్రెస్ నుంచి విముక్తం చేసిన మహోన్నతుడు ఎన్టీఆర్ అన్నారు.

English summary
AP capital in Gautamiputra Satakarni audio release.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X