తప్పుడు లెక్క చెబితే భారీగా ఫైన్.. అడ్డుకుంటే జైలుకే!

దేశ భవిష్యత్తును, ప్రభుత్వ పథకాలను నిర్ణయించే అత్యంత కీలకమైన 'భారత జనగణన-2027' ప్రక్రియ ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నుంచి అధికారికంగా ప్రారంభమైంది. మొదటి దశలో భాగంగా ఇళ్ల గణన, గృహ వసతుల లెక్కింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏపీ జనగణన కార్యకలాపాల సంచాలకుడు జె.నివాస్ సచివాలయంలో కీలక వివరాలను వెల్లడించారు. ఈసారి గణన ప్రక్రియను పూర్తిస్థాయిలో డిజిటల్‌ విధానంలో నిర్వహిస్తుండటంతో పాటు ప్రజలకు అనేక వెసులుబాట్లు కల్పించారు.

మొదటి దశ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికీ వచ్చి మొత్తం 33 రకాల ప్రశ్నలు వేస్తారు. ఇంటి పైకప్పు, గోడలు, నేల ఏ మెటీరియల్‌తో నిర్మించారు? ఇంట్లో గదుల సంఖ్య ఎంత? ఎంతమంది సభ్యులు ఉంటున్నారు? వాహనాలు, తాగునీరు, విద్యుత్ వంటి కనీస వసతులు ఎలా ఉన్నాయి? వంటి వివరాలను సేకరిస్తారు. ప్రభుత్వ పథకాల రూపకల్పనకు ఈ డేటానే ప్రాతిపదిక కానుంది.

AP Census 2027 Starts Rs 1000 Fine for Wrong Info and Up to 3 Years Jail for Obstructing Officials

ఆధార్ అవసరం లేదు.. చిరునామా ముఖ్యం!

ఈసారి జనగణనలో ప్రజలకు ఉన్న అతిపెద్ద అనుమానం ఆధార్ లింకేజీ. అయితే, అధికారులు స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రక్రియకు ఆధార్ నంబరుతో పనిలేదు. మీ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉన్నా సరే.. ప్రస్తుతం మీరు ఎక్కడ నివసిస్తున్నారో ఆ వివరాలనే నమోదు చేస్తారు. అధికారులు ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డులు అడగబోరు, కేవలం మీరు చెప్పే వివరాలనే ప్రామాణికంగా తీసుకుంటారు.

కులగణనపై కేంద్రం సంచలన ప్రకటన!
కులగణనపై కేంద్రం సంచలన ప్రకటన!

సెల్ఫ్ ఎన్యుమరేషన్: మీ వివరాలు మీరే నమోదు చేయొచ్చు!

  • డిజిటల్ విప్లవంలో భాగంగా ఈసారి 'స్వీయ గణన' (Self Enumeration) సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది.
  • ఏప్రిల్ 16 నుంచి 30 వరకు 15 రోజుల పాటు https://se.census.gov.in పోర్టల్‌లో మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వొచ్చు.
  • మీ ఇంటిని జియో-ట్యాగ్ చేసి, అడిగిన వివరాలను ఆన్‌లైన్‌లోనే పూరించవచ్చు.
  • ప్రక్రియ ముగిశాక ఒక ప్రత్యేక ఐడీ (ID) జనరేట్ అవుతుంది.
  • తర్వాత మీ ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్‌కు ఆ ఐడీ చూపిస్తే సరిపోతుంది. ఇది పూర్తిగా ఐచ్ఛికం మాత్రమే.
తెలంగాణలో ఏ కులం జనాభా ఎంత..! మొదటి 20 కులాలు ఇవే డేటా బయటపడింది
తెలంగాణలో ఏ కులం జనాభా ఎంత..! మొదటి 20 కులాలు ఇవే డేటా బయటపడింది

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!

జనగణన విధులకు ఆటంకం కలిగిస్తే ప్రభుత్వం సీరియస్ చర్యలకు సిద్ధమైంది.

  • తప్పుడు సమాచారం: కావాలని తప్పుడు వివరాలు ఇస్తే రూ.1,000 జరిమానా విధిస్తారు.
  • అధికారులను అడ్డుకుంటే: ఎన్యుమరేటర్ల విధులకు ఆటంకం కలిగించినా, ఇళ్లపై నంబర్లు వేయనివ్వకపోయినా క్రిమినల్ కేసులు నమోదు చేసి, 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

లక్ష మందితో భారీ యంత్రాంగం

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.10 లక్షల మంది ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు ఈ విధుల్లో పాల్గొంటున్నారు. వీరంతా తమ గుర్తింపు కార్డులతో పాటు నియామక పత్రాలను వెంట తెచ్చుకుంటారు. ఒకవేళ ఎన్యుమరేటర్లు వచ్చినప్పుడు ఇంటికి తాళం వేసి ఉంటే, వారు మే 30లోపు మళ్ళీ సందర్శించి వివరాలు సేకరిస్తారు. కాగా, అత్యంత కీలకమైన 'కులగణన' రెండో దశలో ఉంటుందని, దానికి సంబంధించిన మార్గదర్శకాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. దేశాభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ప్రజలందరూ ఎన్యుమరేటర్లకు సహకరించి ఖచ్చితమైన వివరాలు అందించాలని ప్రభుత్వం కోరుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+