రాష్ట్రంలో ఏ కులం జనాభా ఎంత? టాప్ 20 కులాల షాకింగ్ లెక్కలు
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. ఏ వర్గం ఎంత? ఎవరి సామాజిక స్థితిగతులు ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 'సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వే' (సీపెక్) నివేదిక వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సీఎస్ రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈ సమగ్ర డేటాను, నిపుణుల కమిటీ నివేదికను అధికారికంగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ సర్వే దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని ధీమా వ్యక్తం చేశారు. "రాహుల్ గాంధీ ఆలోచనలకు రూపమిస్తూ, ప్రతి ఇంటి గడప తొక్కి సేకరించిన ఈ సమాచారం సామాజిక న్యాయ సాధనలో మైలురాయి. పార్లమెంటులో బలం ఉందని కేంద్రం చేస్తున్న ఏకపక్ష నిర్ణయాలకు విరుద్ధంగా.. మేము ప్రజల అవసరాలను గుర్తించి ఈ డేటాను సిద్ధం చేశాం" అని ఆయన పేర్కొన్నారు. ఈ నివేదికను https://des.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, రాజకీయ పార్టీలు, కుల సంఘాలు ఇచ్చే సూచనల మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

అంకెల్లో 'సమగ్ర సర్వే' వైభవం:
ఈ సర్వే కేవలం అంకెలు మాత్రమే కాదు, కోట్లాది మంది ప్రజల ఆశల ప్రతిబింబం.
- రాష్ట్ర మొత్తం జనాభా: 3,54,77,554
- పాల్గొన్న కుటుంబాలు: 1,12,36,849 (97.10 శాతం)
- ప్రజల భాగస్వామ్యం: సుమారు 3.55 కోట్ల మంది.
- క్షేత్రస్థాయి సిబ్బంది: 1.03 లక్షల మంది ఉద్యోగులు.
- సేకరించిన అంశాలు: కులం, మతం, విద్య, ఉపాధి, భూమి, ఆస్తులు, వలసల వంటి కీలక సమాచారం.
తెలంగాణ సామాజిక సమీకరణాలు: టాప్-20 కులాలు
విడుదలైన డేటా ప్రకారం రాష్ట్రంలో జనాభా పరంగా ప్రధాన కులాల వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో మాదిగ సామాజికవర్గం అత్యధికంగా 10.3 శాతంతో ప్రథమ స్థానంలో ఉండగా, ఆ తర్వాత ముదిరాజ్ (7.4%), లంబాడీ (6.8%) వర్గాలు నిలిచాయి.
- 1. మాదిగ (Madiga) - 36,57,551 (10.3%)
- 2. ముదిరాజ్ (Mudiraj) - 26,39,027 (7.4%)
- 3. లంబాడీ / బంజారా (Lambadis) - 24,04,056 (6.8%)
- 4. యాదవ (Yadava/Golla) - 20,18,725 (5.7%)
- 5. రెడ్డి (Reddy) - 17,10,244 (4.8%)
- 6. గౌడ్ (Goud) - 16,30,187 (4.6%)
- 7. మాల (Mala) - 14,71,514 (4.1%)
- 8. మున్నూరు కాపు (Munnurukapu) - 13,75,018 (3.9%)
- 9. పద్మశాలి (Padmasali) - 11,82,252 (3.3%)
- 10. రజక (Rajaka) - 9,95,972 (2.8%)
- 11. కురుమ / కురుబ (Kuruba/Kuruma) - 7,95,822 (2.2%)
- 12. ఒడ్డు / వడ్డెర (Odde/Vaddera) - 6,43,571 (1.8%)
- 13. ముస్లింలు (OC Muslims) - 6,32,782 (1.8%)
- 14. అగ్నికులక్షత్రియ (Agnikulakshatriya) - 5,27,119 (1.5%)
- 15. కొమటి / వైశ్య (Komati/Vaishya) - 5,08,813 (1.4%)
- 16. నాయి బ్రాహ్మణ్ (Nayi Brahmin) - 4,33,785 (1.2%)
- 17. కుమ్మర (Kummara) - 4,31,363 (1.2%)
- 18. కొయ (Koya) - 4,28,142 (1.2%)
- 19. వడ్రంగి (Vadrangi) - 4,07,927 (1.1%)
- 20. గోండ్ (Gond) - 3,81,895 (1.1%)
కేంద్రానికి డిమాండ్.. భవిష్యత్ ప్రణాళిక!
ముందుగా కులగణన వద్దన్న కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణ మోడల్‌ను చూసి అడుగులు వేయక తప్పలేదని మంత్రి పొన్నం ఎద్దేవా చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కంచ ఐలయ్య వంటి నిపుణుల కమిటీ సూచనల మేరకు ఏ వర్గంలో వెనుకబాటుతనం ఎక్కువగా ఉందో గుర్తించి, వారికి తగిన సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ తదుపరి లక్ష్యమని ఆయన ప్రకటించారు. తెలంగాణ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఇదే తరహా సర్వే చేపట్టి ప్రధానమంత్రి మోదీ సామాజిక న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న టాప్ 20 కులాలు (జనాభాతో సహా)👇👇
— Congress for Telangana (@Congress4TS) April 15, 2026
1. మాదిగ (Madiga) – 36,57,551 (10.3%)
2. ముదిరాజ్ (Mudiraj) – 26,39,027 (7.4%)
3. లంబాడీ / బంజారా (Lambadis) – 24,04,056 (6.8%)
4. యాదవ (Yadava/Golla) – 20,18,725 (5.7%)
5. రెడ్డి (Reddy) – 17,10,244 (4.8%)
6.… pic.twitter.com/1eM0hyGJ9j
-
470కి గాను 459 మార్కులు.. ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన వంటలక్క కూతురు !! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!

Download












Click it and Unblock the Notifications