Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

AP Elections: ఎన్నికల షెడ్యూల్ వేళ రాజకీయ పార్టీలకు సీఈవో కీలక సూచనలు..!

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల విడుదలకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. వచ్చే వారం కచ్చితంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఇవాళ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా భేటీ అయ్యారు. సచివాలయంలో రాజకీయ పార్టీలతో ఎన్నికల నిర్వహణపై చర్చించిన సీఈవో.. వారికి పలు కీలక సూచనలు చేశారు.

ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత చేయాల్సిన పనులపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు సీఈవో పలు సూచనలు చేశారు. ఇందులో ఎన్నికల ప్రచారం, బహిరంగసభల నిర్వహణ, హెలికాఫ్టర్ల వాడకం, ఎన్నికల వ్యయం వంటి అంశాలపై సీఈవో కీలక సూచనలు చేశారు. వీటిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని వారికి తేల్చిచెప్పారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే కోడ్ అమల్లోకి వస్తుందని, అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా హెచ్చరికలు చేశారు.

ap chief election officer alerts politial parties in wake of poll schedule release

రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియపై సమగ్ర అవగాహన ఏర్పర్చుకుని రాష్ట్రంలో జరిగే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని మీనా కోరారు. ఈసీ ఎన్నికల షెడ్యూలును ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని, నోటిఫికేషన్ మాత్రం ఐదారు రోజుల తర్వాత వస్తుందనే విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందన్నారు.

ఈ సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళికి లోబడి ప్రవర్తించాల్సి ఉంటుందన్నారు. ఎటు వంటి బహిరంగ కార్యక్రమాలను నిర్వహించాలన్నా ముందుగా అనుమతి పొందాల్సి ఉంటుదన్నారు. రాజకీయ పార్టీలు, ప్రతినిధులు నిర్వహించే ఎటు వంటి కార్యక్రమాలను అయినా పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. కుల, మత, భాష ప్రాతిపదిక ఓటర్లను ప్రేరేపించడం, ఓట్లు వేయమని అడగడం పూర్తిగా నిషిద్దమన్నారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోనున్న సమయంలో అభ్యర్థులు, ఏజంట్లు, కార్యకర్తలు రూ.50 వేలకు మించి నగదు, రూ.10 వేలకు మించి విలువైన వస్తులు వాహనాల్లో రవాణా చేయడం నిషిద్దమన్నారు. స్టార్ క్యాంపైనర్లు రూ.1.00 లక్షకు మించి నగదు కలిగి ఉండ కూడదన్నారు. పరిమితికి మించి నగదు ఉన్న వాహనాలను, నగదును సీజ్ చేస్తామన్నారు.ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుందన్నారు.

ap chief election officer alerts politial parties in wake of poll schedule release

ఎన్నికల్లో పోటీచేసే లోక్ సభ అభ్యర్థులు రూ.25 వేలు, శాసనసభ అభ్యర్థులు రూ.10 వేలు నగదు రూపేణాగాని లేదా ఆర్.బి.ఐ./ట్రెజరీ ద్వారా సెక్యురిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుదన్నారు. చెక్కులు, బ్యాంకు డ్రాప్టులను అనుమతించడం లేదన్నారు. ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 11 గంటల నుండి మద్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే సంబంధిత ఆర్.ఓ.లు, ఏఆర్ఓలు నామినేషన్లను స్వీకరిస్తారన్నారు. నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులు 100 మీటర్ల దూరంలో వారి వాహనాలను నిలపాలన్నారు. అభ్యర్థితో కలుపుకుని మొత్తం ఐదుగురిని లోపలకు అనుమతిస్తామన్నారు.

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయంపై పూర్తి స్థాయిలో నిఘా ఉంటుందన్నారు. ప్రతి లోక్ సభ అభ్యర్థికి రూ.95 లక్షలు, శాసన సభ అభ్యర్థికి రూ.40 లక్షల మేర వ్యయం చేసేందుకు అనుమతి ఉందన్నారు. ఈ వ్యయాన్ని బహిరంగ సభల నిర్వహణకు, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాల వినియోగానికి మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా నగదు, బహుమతులు, మద్యం, ఇతర వస్తులు పంపిణీ చేయడం చట్ట విరుద్దమన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+