అనుచిత పోస్టులు పెడితే, ఇక - సీఐడీ చీఫ్ హెచ్చరిక..!!
సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల పై కఠినంగా వ్యవహరిస్తామని సీఐడీ చీఫ్ సంజయ్ హెచ్చరించారు. ఎవరి మీద పోస్టులు చేసినా వదలబోమని తాజాగా హెచ్చరించింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల అంశంపై దృష్టి సారించామని.. నిబంధనల్ని ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. కఠిన చర్యలు మాత్రం తప్పవు అని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలపై అనుచిత పోస్టులు పెట్టినా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అనుచిత పోస్టులు పెడితే : సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తామని సంజయ్ స్పష్టం చేసారు. సీఎంపై, వారి కుటుంబసభ్యులపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారన్నారు. మారుపేర్లతో పెడితే ఎవరికీ తెలీదని అనుకోవడం పొరపాటన్నారు ఫేక్ అకౌంట్స్‌ను పట్టుకోలేమని అనుకోవడం సరికాదని చెప్పారు. ఫేక్ అకౌంట్స్‌ను నడిపే వారిని పట్టుకుని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి వారిని ప్రోత్సహించే వారిపైనా కఠిన చర్యలుంటాయని తేల్చి చెప్పారు. హైకోర్టు జడ్జిలపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారననారు. ఇటీవల మహిళా జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశంపైనా దృష్టిపెట్టమని అని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ పేర్కొన్నారు.

కఠినంగా వ్యవహరిస్తాం : మహిళా నేతలపైనా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని... ఇలాంటి అనుచిత పోస్టులు పెట్టినవారిపై కచ్చితంగా చర్యలుంటాయన్నారు. అలాగే ప్రతిపక్ష నేతలపైనా సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులను పరిశీలిస్తున్నామన్నారు. ఎవరి మీద అయినా సరే సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తే చూస్తూ ఊరుకోం. కఠిన చర్యలు మాత్రం తప్పవు అని స్పష్టం చేశారు. సోషల్ మీడియాను చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. సోషల్ మీడియాను పాజిటివ్‌గా ఉపయోగించుకోవాలి. దీనిపై మరింత అవగాహన కల్పించాలని భావిస్తున్నాం అని సంజయ్ తెలిపారు. గత ఏడాది 1450 పోస్టులు.. ఈ ఏడాది 2164 సోషల్ మీడియాలో వచ్చిన అభ్యంతర మెసేజ్‌లను తొలగించామన్నారు. న్యాయ వ్యవస్ధపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆస్తులు సీజ్ : అవసరమైతే వీరి ఆస్తులు సీజ్ చేయడానికి వెనకాడమని హెచ్చరించారు. ఇతర దేశాలలో ఉండి అశ్లీల, అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఆయా దేశాల ఎంబసీతో సంప్రదింపులకు సీఐడీ ప్రత్యేక బృందాలు పంపించామని చెప్పారు. యూకే, అమెరికా దేశాలకు సీఐడీ బృందాలు పంపామని వివరించారు. ఇప్పటికే 45 కేసుల్లో ఐదుగురిపై ఎల్‌వోసీ ప్రోసీడింగ్స్ చేపట్టామన్నారు. రాజకీయ పార్టీలపై ఉన్న అభిమానంతో అసభ్యకరపోస్టులు పెట్టి భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దని ఏపీ సీఐడీ సూచించింది. సోషల్ మీడియాలో అసభ్యకర మెసేజ్‌లు పెట్టే 2,972 మందిపై సైబర్ బుల్లియింగ్ షీట్స్ ఓపెన్ చేశామని సంజయ్ వెల్లడించారు. సోషల్ మీడియా పేరుతో పరిధి దాటి అసభ్యకరమెసేజ్‌లు పెడితే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications