రఘురామరాజు ఇంటికి సీఐడి అధికారులు: నోటీసులా - అదుపులోకా : ఏం జరుగుతోంది...!!
మరోసారి రఘురామ అంశంలో కలకలం మొదలైంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ నివాసానికి ఏపీ సీఐడి అధికారులు చేరుకున్నారు. నలుగురు అధికారులు రఘరామ ఇంటి వద్ద వెయిట్ చేస్తున్నారు. ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చారని చెబుతున్నారు. రఘురామ బయటకు రాకపోవటంతో ప్రస్తుతం వారు వెయిట్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఏ కేసుకు సంబంధించి నోటీసులు ఇవ్వబోతున్నదీ స్పష్టత రాలేదు. అదే సమయంలో గతంలోనే సీఐడి అధికారులు పలు రకాల కేసులు రఘురామ మీద నమోదు చేసి ఉండటంతో... వాటికి సంబంధించి నోటీసులు ఇవ్వనున్నారా.. లేక, అదుపులోకి తీసుకుంటారా అనేది ఉత్కంఠగా మారుతోంది.
Recommended Video

రఘురామ నివాసానికి సీఐడి అధికారులు
గతంలో సీఐడీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన తరువాత రఘురామ సుప్రీం నుంచి బెయిల్ పొందారు. అప్పటి నుంచి ఆయన ఢిల్లీలోనే ఉంటున్నారు. తిరుపతిలో జరిగిన అమరావతి సభలో పాల్గొనేందుకు ఏపీకి వచ్చారు. ఇక, ఇప్పుడు తాను రాజీనామా చేసి..ఉప ఎన్నికలో తిరిగి నర్సాపురం నుంచి పోటీ చేస్తానని చెబుతున్న రఘురామ.. సంక్రాంతికి తన సొంత నియోజవకర్గానికి రానున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగా ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో..రఘురామకు నోటీసులు ఇవ్వటానికి ఏపీ సీఐడి అధికారులు వచ్చారని చెబుతున్నారు.

అప్పటి నుంచి ఢిల్లీలోనే
రఘురామ బయటకు వచ్చిన తరువాత నోటీసులు జారీ చేయటానికి పరిమితం అవుతారా లేదా అనేది తేలాల్సి ఉంది. అయితే, విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చేందుకు అధికారులు వచ్చారని చెబుతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామ నివాసం వద్ద ప్రస్తుతం ఏపీ సీఐడి అధికారులు రఘురామ కోసం నిరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. రఘురామ సైతం తమ న్యాయవాదుల కోసం వెయిట్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. సీఐడీ అధికారులు నోటీసులు వ్యవహారంతో ఇప్పుడు మరోసారి రఘురామ అంశం సంక్రాంతి వేళ ఏపీలో రాజకీయంగా ఉత్కంఠకు కారణమవుతోంది.

సీఐడీ అధికారులతో న్యాయవాదుల మంతనాలు..
గతంలో సీఎం జగన్ పైన అనుచతిత వ్యాఖ్యల కేసులో గతంలో సుప్రీంలో బెయిల్ పొందిన తరువాత రఘురామ విచారణకు రాలేదు. దీంతో..ఆ కేసుల విషయంలో తదుపరి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చేందుకే సీఐడి అధికారులు వచ్చారని తెలుస్తోంది. సీఐడీ అధికారులు రావటంతో..వెంటనే రఘురామ న్యాయవాదులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. నోటీసులు రఘురామ తరపు న్యాయవాదులు సీఐడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
రఘురామకు తాము నోటీసులు ఇచ్చి వెళ్తామని సీఐడీ అధికారులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. రేపటి నుంచి రెండు రోజుల పాటు రఘురామ నర్సాపురంలోనే ఉంటానంటూ ఇప్పటికే ప్రకటించారు. దీంతో..నోటీసుల్లో ఏం పేర్కొన్నారు.. విచారణకు ఎప్పుడు రావాలని చెప్పబోతున్నారు.. రఘురామ ఏం చేయబోతున్నారనేది స్పష్టత రావాల్సి ఉంది. తాము రఘురామ చేతికే నోటీసులు ఇస్తామని చెప్పటంతో..న్యాయవాదులు ప్రస్తుతం రఘురామతో మంతనాలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications