ఎన్నారైలూ!..మీరంతా టిడిపికి ఓటు వేయండి...మా పార్టీకే ప్రచారం చేయండి:అమెరికాలో చంద్రబాబు పిలుపు
న్యూయార్క్:ఎన్నారైలూ!...ఈ ఏడాది మీకు ఓటు వస్తోంది...మీరంతా ఇక్కడ నుంచే ఓటేయవచ్చు...మీరంతా ఓటు వేయడంతో పాటు టీడీపీకి ప్రచారం చేయాలి'...అని ఎన్నారైలకు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.
అమెరికా పర్యటనలో భాగంగా ఆయన న్యూయార్క్‌లో ఎన్‌ఆర్‌ఐల బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైలు ముందుకు రావాలని...వారికి అన్ని విధాలా పూర్తి సహకారం అందిస్తామని సిఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
పుట్టిన గడ్డను ఎప్పుడూ మరవద్దని...ఆ రోజు తాను ఐటీకి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఇంతమంది అమెరికా రాగలిగారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దూరం అనేది పెద్ద సమస్య కాదని...మీ గ్రామం కోసం ఆలోచించండని వారికి సూచించారు. ఎన్నారైలు తమ ఆలోచనలను గ్రామస్థులతో పంచుకోవాలని అన్నారు.

తద్వారా మీ జన్మభూమికి, మీరు పుట్టిపెరిగిన గ్రామానికి ఏయిచేయొచ్చో...ఏది అవసరమో తెలుస్తుందన్నారు. గ్రామదర్శని -వార్డు దర్శని కార్యక్రమంలో తమకు చేయూత ఇవ్వాలని ఎన్‌ఆర్‌లను చంద్రబాబు కోరారు. తాను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు 58 శాతం పూర్తి అయ్యిందని తెలిపారు.
మరోవైపు ఇదే సభలో అరకులో హత్యకు గురైన టీడీపీ నేతలు కిడారి, సివేరి సోమ హత్యల గురించి సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో హత్యలకు తావులేదని...కిడారి, సివేరి సోమ హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ప్రాణం పోయలేనివారికి ప్రాణం తీసే హక్కు లేదన్నారు. 'నిర్మాణమే మన బాధ్యత అని...అంతే తప్ప విధ్వంసం నైజం కారాదని సిఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలను అందరు ఖండించాలని సీఎం చంద్రబాబు కోరారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications