మంత్రులకు చంద్రబాబు అలర్ట్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు కీలక సూచనలు చేశారు. జగన్ నాశనం చేసిన వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ రాష్ట్రాన్ని పునర్నిర్మించడంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని చంద్రబాబు అభిలషించారు. వ్యక్తిగత కార్యదర్శులు, సహాయకుల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జగన్ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పని చేసిన సిబ్బందిని దరి చేరనివ్వద్దని చంద్రబాబు నిర్దేశించారు. శాఖల వారీగా శ్వేత పత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు పెడదామని చెప్పారు. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రివర్గ సహచరులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

మంత్రుల అభీష్టాలు, వారి సమర్ధత బట్టి గురువారంలోగా శాఖలు కేటాయిస్తానని చంద్రబాబు అన్నారు. ఇచ్చిన శాఖకు పూర్తి స్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మీదేనని మంత్రులకు చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖాపరంగా ప్రజలకు చేకూర్చాల్సిన లబ్ధిపై దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు.
తిరుమలకు చేరుకున్న చంద్రబాబు: ప్రొటోకాల్ పాటించని ఇంఛార్జీ ఈవో
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు. బుధవారం రాత్రికి చంద్రబాబు కుటుంబసభ్యులు తిరుమలలోనే బస చేయనున్నారు. గురువారం ఉదయం 8 గం.కు శ్రీవారి సేవలో చంద్రబాబు, కుటుంబసభ్యులు పాల్గొంటారు. అంతకు ముందు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు తిరుపతి కలెక్టర్ ప్రవీణ్, ఎస్పీ హర్షవర్ధన్, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
— Telugu Desam Party (@JaiTDP) June 12, 2024
అయితే, సీఎం చంద్రబాబు తిరుమలకు చేరుకున్నప్పటికీ.. ప్రోటోకాల్ విషయంలో టీటీడీ అధికారులు నిర్లక్ష్యం వహించారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు టీటీడీ ఇంఛార్జి ఈవో వీరబ్రహ్మం వాహనం వద్దకు రాలేదు. సీఎంను అవమానపరిచేలా వ్యవహరించారు. అయితే, గాయత్రినిలయం భవనం లోపలకు వెళ్లాక.. ఇంఛార్జి ఈఓ వీరబ్రహ్మం పూలబొకే ఇచ్చేందుకు యత్నించారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేస్తూ ఆ పూలబొకేను తిరస్కరించారు.












Click it and Unblock the Notifications