కోలుకుంటున్నాం: బాబు, ఆ సినిమాల్లో అసభ్యతలేని శృంగారం: వెంకయ్య, కేసీఆర్‌కు కితాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. విజయవాడలో పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ బుక్ ఫేర్ 11 రోజుల పాటు జరగనుంది. ఈ కార్యక్రమంలో వెంకయ్య, చంద్రబాబులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. భావితరాలకు చరిత్రను అందించేందుకు కృషి చేయాలన్నారు. 2018ని తెలుగు భాషా పరిరక్షణగా నామకరణ చేసుకోవాలన్నారు. పూర్వవైభవం గుర్తుకు తెచ్చేలా అమరావతి నిర్మాణం ఉంటుందని చెప్పారు. భాషను కాపాడుకునేందుకు అందరు ముందుకు రావాలన్నారు.

పుస్తకాల్లో శాస్త్రీయ, సాంకేతిక విజ్ఞానం, పెద్దవాళ్లు చెప్పింది విశ్లేషించాలి: వెంకయ్య

విభజన సమస్యల నుంచి కోలుకుంటున్నాం

విభజన సమస్యల నుంచి కోలుకుంటున్నాం

విభజన సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. పుస్తకాలు లేకుంటే చరిత్ర అనేది లేదని చెప్పారు. భాష లేకుంటే సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగు అవుతాయన్నారు. భాషను కాపాడుకోవడంలో పుస్తకానిది ముఖ్య పాత్ర అన్నారు.

2017 కలిసి వచ్చింది

2017 కలిసి వచ్చింది

2017 మంచి ఏడాది అని, అది మనకు కలిసి వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఎందరో గొప్పవారు ఇక్కడి వారే (విజయవాడ) అన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాలకు ఏపీతోనే నాంది పలికామని చెప్పారు. ఉపాధి కోసం ఆంగ్లం నేర్చుకున్నప్పటికీ భాష, సంస్సృతి సంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు.

సినిమాలపై వెంకయ్య సునిశిత విమర్శలు

సినిమాలపై వెంకయ్య సునిశిత విమర్శలు


నేటి తరం సినిమాలపై వెంకయ్య నాయుడు సునిశిత విమర్శలు చేశారు. సినిమాల ప్రభావం ప్రజలపై ఎక్కువగా ఉంటుందని, కానీ ఆ సినిమాల్లో నాణ్యత కనిపించడం లేదని వాపోయారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేవిధంగా సినిమాలు ఉండాలన్నారు.

అసభ్యత లేకుండా అద్భుత శృంగారం

అసభ్యత లేకుండా అద్భుత శృంగారం

ఆనాటి సినిమాల్లో (పాత సినిమాల్లో) అసభ్యత లేకుండా అద్భుతంగా శృంగారం ఉండేదని వెంకయ్య చెప్పారు. తెలుగు భాషపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచనలకు తాను ప్రశంసలు తెలిపానని గుర్తు చేశారు. వెంకయ్య తన ప్రసంగం సందర్భంగా పాత చింతకాయ పచ్చడి, చింతపొడి ప్రస్తావన వంటి మాటలతో ఆకట్టుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP CM Chandrababu Naidu along with Vice President Venkaiah Naidu inaugurated Vijayawada Book Festival on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి