‘లేపాక్షి ఉత్సవాలు చరిత్రకు నాంది’: బాబు, ప్రత్యేక ఆకర్షణ బాలకృష్ణ(పిక్చర్స్)

అనంతపురం: లేపాక్షి ఉత్సవాలు నూతన చరిత్రకు నాంది పలికాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. లేపాక్షిని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడంతోపాటు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు లేపాక్షికి పూర్వ వైభవం తీసుకొస్తాయన్నారు. ప్రతి ఏడాది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు.

అనంతపురం జిల్లా లేపాక్షిలో రెండ్రోజులపాటు నిర్వహిస్తున్న లేపాక్షి ఉత్సవాలను శనివారం సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. హిందూపురం అంటేనే ఎన్టీఆర్ గుర్తొస్తారన్నారు. రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలున్నా హిందూపురంపై ఉన్న అభిమానంతో ఎన్టీఆర్‌ ఇక్కడి నుంచి పోటీ చేశారన్నారు.

ఎన్టీఆర్‌ బాటలోనే బాలకృష్ణ కూడా హిందూపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారన్నారు. హిందూపురం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు బాలకృష్ణ చేస్తున్న కృషికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ, సహకారాలు అందిస్తుందన్నారు.

పర్యాటక రంగం నుంచి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం రాబట్టవచ్చునన్నారు. అందుకే తమ ప్రభుత్వం పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ మాట్లాడుతూ.. లేపాక్షి ఉత్సవాలు తనకు అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చాయన్నారు.

ప్రత్యేక ఆకర్షణ బాలయ్య

కాగా, లేపాక్షి ఉత్సవాలకు ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శోభా యాత్రలో భాగంగా అశ్వ రథాన్ని నడుపుతూ సందడి చేశారు. అలాగే సినీనటి జయసుధ, జయప్రకాష్‌రెడ్డి, చలపతిరావు, అశోక్‌కుమార్‌ వంటి నటులతో పాటు.. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలనాటి నటి జయంతికి వేదికపై సన్మానం నిర్వహించారు. సాంస్కతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులను బాలకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు.

లేపాక్షి ఉత్సవాలు

లేపాక్షి ఉత్సవాలు

లేపాక్షి ఉత్సవాలు నూతన చరిత్రకు నాంది పలికాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

లేపాక్షి ఉత్సవాలు

లేపాక్షి ఉత్సవాలు

లేపాక్షిని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడంతోపాటు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

లేపాక్షి ఉత్సవాలు

లేపాక్షి ఉత్సవాలు

అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు లేపాక్షికి పూర్వ వైభవం తీసుకొస్తాయన్నారు. ప్రతి ఏడాది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు.

లేపాక్షి ఉత్సవాలు

లేపాక్షి ఉత్సవాలు

అనంతపురం జిల్లా లేపాక్షిలో రెండ్రోజులపాటు నిర్వహిస్తున్న లేపాక్షి ఉత్సవాలను శనివారం సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

లేపాక్షి ఉత్సవాలు

లేపాక్షి ఉత్సవాలు

అనంతరం స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. హిందూపురం అంటేనే ఎన్టీఆర్ గుర్తొస్తారన్నారు. రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలున్నా హిందూపురంపై ఉన్న అభిమానంతో ఎన్టీఆర్‌ ఇక్కడి నుంచి పోటీ చేశారన్నారు.

లేపాక్షి ఉత్సవాలు

లేపాక్షి ఉత్సవాలు

ఎన్టీఆర్‌ బాటలోనే బాలకృష్ణ కూడా హిందూపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారన్నారు.

లేపాక్షి ఉత్సవాలు

లేపాక్షి ఉత్సవాలు

హిందూపురం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు బాలకృష్ణ చేస్తున్న కృషికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ, సహకారాలు అందిస్తుందన్నారు.

లేపాక్షి ఉత్సవాలు

లేపాక్షి ఉత్సవాలు

పర్యాటక రంగం నుంచి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం రాబట్టవచ్చునన్నారు. అందుకే తమ ప్రభుత్వం పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

లేపాక్షి ఉత్సవాలు

లేపాక్షి ఉత్సవాలు

రాయలసీమను రతనాల సీమగా మారుస్తామన్నారు. హంద్రీనీవాను ఏడాదిలోపు పూర్తి చేసి ‘అనంత'లోని అన్ని చెరువులను నీటితో నింపి అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. లేపాక్షి భూములను ప్రభుత్వం తీసుకుని పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తుందన్నారు.

లేపాక్షి ఉత్సవాలు

లేపాక్షి ఉత్సవాలు

ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ మాట్లాడుతూ.. లేపాక్షి ఉత్సవాలు తనకు అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చాయన్నారు.

లేపాక్షి ఉత్సవాలు

లేపాక్షి ఉత్సవాలు

ఈ ఉత్సవాలు తన ఆధ్వర్యంలో జరగడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. మరణించిన తర్వాత జీవించే వారే మహనీయులని, అలాంటి మహనీయుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు.

లేపాక్షి ఉత్సవాలు

లేపాక్షి ఉత్సవాలు

లేపాక్షి ఉత్సవాలకు ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శోభా యాత్రలో భాగంగా అశ్వ రథాన్ని నడుపుతూ సందడి చేశారు.

లేపాక్షి ఉత్సవాలు

లేపాక్షి ఉత్సవాలు

అలాగే సినీనటి జయసుధ, జయప్రకాష్‌రెడ్డి, చలపతిరావు, అశోక్‌కుమార్‌ వంటి నటులతో పాటు.. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

లేపాక్షి ఉత్సవాలు

లేపాక్షి ఉత్సవాలు

అలనాటి నటి జయంతికి వేదికపై సన్మానం నిర్వహించారు. సాంస్కతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులను బాలకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు.

లేపాక్షి ఉత్సవాలు

లేపాక్షి ఉత్సవాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేడుకలకు జిల్లాతో పాటు.. పొరుగు రాష్ట్రం నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు.

లేపాక్షి ఉత్సవాలు

లేపాక్షి ఉత్సవాలు

రెండు రోజుల ఉత్సవాల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయటంతో ఎక్కడా ఇబ్బంది లేకుండా పోయింది.

లేపాక్షి ఉత్సవాలు

లేపాక్షి ఉత్సవాలు

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయంతో ప్రయాణానికి ఇబ్బంది కలగలేదు. దీంతో ప్రజల రాక గంటగంటకూ పెరుగుతూ వచ్చింది.

లేపాక్షి ఉత్సవాలు

లేపాక్షి ఉత్సవాలు

ఉదయం నుంచి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయటంతో.. ఉత్సవాల్లో పాల్గొనటానికి వచ్చిన వాళ్లు నేరుగా లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించుకుని.. అక్కడి నుంచి వేదిక దగ్గర ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+