నా గుండె బరువెక్కింది.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్

సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతూ మురళీ నాయక్‌ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. తాజాగా అధికార లాంఛనాలతో మురళీ అంత్యక్రియలు ముగిశాయి. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలో అధికారిక లాంఛనాలతో జరిగాయి. ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు లోకేష్, అనిత, సత్యప్రసాద్‌.. మురళీ నాయక్‌ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అంత్య క్రియలు ముగిసే వరకూ అక్కడే ఉన్నారు.

అయితే తాజాగా మురళీ నాయక్‌ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 'వీర జవాన్ మురళీ నాయక్ కు అంతిమ వీడ్కోలు పలుకుతున్నాను. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల శోకంతో నా గుండె బరువెక్కింది. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన మురళీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అమరవీరుడు మురళీనాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షల పరిహారం ఇస్తాం. 5 ఎకరాల సాగుభూమితో పాటు... 300 గజాల ఇంటి స్థలం కేటాయిస్తాం. అదే విధంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం. మురళీ నాయక్ నేడు మన మధ్య లేకపోయినా.... ఆయన దేశం కోసం చేసిన త్యాగం ఎప్పుడూ స్ఫూర్తి రగిలిస్తునే ఉంటుందని తెలుపుతూ నివాళి ఘటిస్తున్నాను' అని సీఎం చంద్రబాబు తెలిపారు.

AP CM Chandrababu Naidu Pays Tributes to Martyred Jawan Murali Naik

అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. తీవ్ర భావోద్వేగంతో ఉన్న మురళీ నాయక్ కుటుంబాన్ని పవన్ ఓదార్చారు. వాళ్లకు ధైర్య చెప్పారు. ఈ క్రమంలో పవన్ కూడా కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడి వారిని కలిచివేసింది. మంత్రి నారా లోకేశ్ కూడా మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. జవాన్ తల్లిదండ్రులను ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఇక మురళీ నాయక్ భౌతిక కాయం తరలించే సమయంలో రాష్ట్ర మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. జవాన్ కు నివాళిగా జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి కూడలిలో వేల సంఖ్యలో ప్రజలు చేరుకుని పూలతో వీడ్కోలు పలికారు. మంత్రి సవిత పర్యవేక్షణలో ప్రజలు భారీ కాన్వాయ్‌గా ఏర్పడి, జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహిస్తూ భౌతికకాయాన్ని తరలించారు. దీంతో బెంగళూరు నుంచి కళ్లితండాకు 90 నిమిషాల ప్రయాణం 8 గంటలు పట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+