దత్తత: లోకేష్ నిమ్మకూరు, బ్రాహ్మణి నారావారిపల్లె
హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టిన ‘సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోచన' పథకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులు కూడా ఆకర్షితులయ్యారు. స్మార్ట్ ఏపి, స్మార్ట్ విలేజ్ కార్యక్రమాల్లో భాగంగా చంద్రబాబు కుటుంబసభ్యులంతా తలా ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
తెలుగుదేశం వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీఆర్ స్వగ్రామం కృష్టా జిల్లాలోని నిమ్మకూరు గ్రామాన్ని చంద్రబాబు తనయుడు, టిడిపి నేత లోకేష్ దత్తత తీసుకున్నారు. అదే జిల్లాలోని కొమరవోలు(ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పుట్టిన ఊరు) గ్రామాన్ని చంద్రబాబు భార్య భువనేశ్వరి దత్తత తీసుకున్నారు.
కాగా, చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లెను చంద్రబాబు కోడలు, లోకేష్ సతీమణి బ్రాహ్మణి దత్తత తీసుకున్నారు.

శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు చేసిన ఎన్టీఆర్ కుమార్తెలు
శ్రీకాళహస్తి దేవస్థానానికి శుక్రవారం దివంగత నేత ఎన్టీఆర్ కుమార్తెలు దారపాటి లోకేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి, బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర, నారా ఇందిర విచ్చేశారు. వారికి ఆలయ ఈవో రామిరెడ్డి స్వాగతం పలికారు. రూ. 2,500 టికెట్ ద్వారా ప్రత్యేక రాహుకేతు పూజలు నిర్వహించారు.
అనంతరం శ్రీకాళహస్తిశ్వర స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత గురుదక్షిణమూర్తి వద్ద వేద పండితుల నుంచి ఆశీర్వదం పొందారు. వారికి స్వామి, అమ్మవార్ల చిత్ర పటాన్ని, తీర్థ ప్రసాదాలను ఈవో అందజేశారు.












Click it and Unblock the Notifications