"మనందరం రాజధాని వారసులమయ్యాం"(ఫోటోలు)
గుంటూరు: నవ్యాంధ్ర రాజధాని గుంటూరు జిల్లా తుళ్లూరులో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు గురువారం ఉదయం ఇక్కడికి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం లభించింది. తుళ్లూరు ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు.
తుళ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు గురువారం మధ్యాహ్నాం 12.15 గంటలకు నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలసి సీఎం ఇక్కడికి చేరుకున్నారు. హెలిప్యాడ్ నుంచి వేడుకలు ఏర్పాటు చేసిన మేరీమాత హైస్కూల్ ప్రాంగణం వరకు ఓపెన్‌టాప్ వాహనంపై ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు మాట్లాడుతూ ‘‘మనమందరం రాజధాని వాసులమయ్యాం. ఇకపై వచ్చేవాళ్లంతా వలస పక్షులే'' అని వ్యాఖ్యానించగానే సభా ప్రాంగణం హర్షధ్వానాలతో మారు మోగింది. నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి కలిసి వచ్చిన ఈ పవిత్రమైన రోజున రాజధాని నగర ప్రజల దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు.
‘‘సింగపూర్ ఎలా ఉందో నవ్యాంధ్ర రాజధాని నగరమైన తుళ్లూరును కూడా అలానే అభివృద్ధి చేస్తా.'' అని హామీ ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచాలని కోరారు. విజయవాడ కనకదుర్గమ్మ, వైకుంఠపురం వెంకటేశ్వరస్వామి దీవెనలతో ఈ ఏడాది రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని, ఇవి పూర్తయితే ఆంధ్రప్రదేశ్ చరిత్ర మారిపోతుందన్నారు.
‘‘భూ సమీకరణ, ప్రభుత్వ ప్యాకేజీ విషయంలో రైతులకు సరైన సమాచారం లేదు. అందుకే కొంతమంది ఆందోళన చెందుతున్నారు. ఏ ఒక్కరూ అధైర్యపడొద్దు. మీరు చేసిన త్యాగాలకు అండగా ఉండి తప్పక న్యాయం చేస్తాను. నవీ ముంబై, నయా రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్ కంటే ఎన్నో రెట్ల మెరుగైన ప్యాకేజీని ఇస్తున్నాం'' అని అన్నారు.

తుళ్లూరులో ఓపెన్ టాప్ జీబులో బాబు
హెలిప్యాడ్ నుంచి వేడుకలు ఏర్పాటు చేసిన మేరీమాత హైస్కూల్ ప్రాంగణం వరకు ఓపెన్‌టాప్ వాహనంపై ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

తుళ్లూరులో ఓపెన్ టాప్ జీబులో బాబు
చంద్రబాబు మాట్లాడుతూ ‘‘మనమందరం రాజధాని వాసులమయ్యాం. ఇకపై వచ్చేవాళ్లంతా వలస పక్షులే'' అని వ్యాఖ్యానించగానే సభా ప్రాంగణం హర్షధ్వానాలతో మారు మోగింది.

తుళ్లూరులో ఓపెన్ టాప్ జీబులో బాబు
నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి కలిసి వచ్చిన ఈ పవిత్రమైన రోజున రాజధాని నగర ప్రజల దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు.

తుళ్లూరులో ఓపెన్ టాప్ జీబులో బాబు
‘‘సింగపూర్ ఎలా ఉందో నవ్యాంధ్ర రాజధాని నగరమైన తుళ్లూరును కూడా అలానే అభివృద్ధి చేస్తా.'' అని హామీ ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచాలని కోరారు.

తుళ్లూరులో ఓపెన్ టాప్ జీబులో బాబు
విజయవాడ కనకదుర్గమ్మ, వైకుంఠపురం వెంకటేశ్వరస్వామి దీవెనలతో ఈ ఏడాది రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని, ఇవి పూర్తయితే ఆంధ్రప్రదేశ్ చరిత్ర మారిపోతుందన్నారు.

తుళ్లూరులో ఓపెన్ టాప్ జీబులో బాబు
సంక్రాంతిలోపే ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ నేతృత్వంలోని కమిటీకి భూమి అంగీకార పత్రాలు ఇస్తే లే అవుట్ ప్లాన్ తాను చూసుకుంటానని చెప్పారు.

తుళ్లూరులో ఓపెన్ టాప్ జీబులో బాబు
సీఆర్‌డీఏ కార్యాలయం కూడా తుళ్లూరులో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రతి గ్రామానికి రెవెన్యూ బృందాలను పంపి హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

తుళ్లూరులో ఓపెన్ టాప్ జీబులో బాబు
ధనేకుల రామారావు, పోతురాజు శ్రీనివాసరావు, జమ్ముల మురళి, దామినేని శ్రీనివాసరావు, అనుమోలు గణేష్ ప్రసాద్ అనే ఐదుగురు రైతులు తమ 164 ఎకరాల భూమిని భూ సమీకరణ విధానం కింద ప్రభుత్వానికి ఇచ్చేందుకు సమ్మతిస్తూ పట్టాదారు పాస్ పుస్తకాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు.

తుళ్లూరులో ఓపెన్ టాప్ జీబులో బాబు
వీరిలో రామారావు రాజధాని నిర్మాణానికి రూ.50 వేలు విరాళాన్ని కూడా ఇచ్చారు. పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు రూ.6.5 లక్షలు అందజేశారు.

తుళ్లూరులో ఓపెన్ టాప్ జీబులో బాబు
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, పి. నారాయణ, జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీమతి జానీమూన్, ఎంపీలు గల్లా జయదేవ్, ఎమ్యెల్యేలు శ్రావణ కుమార్, మోదుగల వేణు గోపాల్ రెడ్డి, ధూళిపాళ నరేంద్ర, జీవి ఆంజనేయులు, రాయపాటి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తదితరులు హాజరయ్యారు.
సంక్రాంతిలోపే ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ నేతృత్వంలోని కమిటీకి భూమి అంగీకార పత్రాలు ఇస్తే లే అవుట్ ప్లాన్ తాను చూసుకుంటానని చెప్పారు. సీఆర్‌డీఏ కార్యాలయం కూడా తుళ్లూరులో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రతి గ్రామానికి రెవెన్యూ బృందాలను పంపి హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, పి. నారాయణ, జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీమతి జానీమూన్, ఎంపీలు గల్లా జయదేవ్, ఎమ్యెల్యేలు శ్రావణ కుమార్, మోదుగల వేణు గోపాల్ రెడ్డి, ధూళిపాళ నరేంద్ర, జీవి ఆంజనేయులు, రాయపాటి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తదితరులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications