'వైసీపీ జైత్రయాత్ర', 'అలజడులకు ఫ్యాక్షనిస్టులు, రౌడీలా', బాబు టూర్
నంద్యాలలో ఫ్యాక్షనిస్టులకు , రౌడీలకు ఎట్టిపరిస్థితుల్లో స్తానం కల్పించబోరని వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. దేశచరిత్రలోనే నంద్యాలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఎ
నంద్యాల: నంద్యాలలో ఫ్యాక్షనిస్టులకు , రౌడీలకు ఎట్టిపరిస్థితుల్లో స్తానం కల్పించబోరని వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. దేశచరిత్రలోనే నంద్యాలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల పట్టణంలో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు.మరోవైపు ఏపీ సిఎం చంద్రబాబునాయుడు ఈ నెల 22న, నంద్యాలలో పర్యటించనున్నారు.
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించేందుకుగాను అధికార టిడిపి, విపక్ష వైసీపీలు పావులు కదుపుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే నంద్యాలలో ఎన్నికల వేడి రాజుకొంది.
వైసీపీ, టిడిపి నేతలు ఈ నియోజకవర్గంలో మోహరించారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి నంద్యాలలో పర్యటించనున్నారు. ఈ నెల 22వ, తేదిన చంద్రబాబునాయుడు నంద్యాల నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
వారం రోజుల క్రితమే ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించారు.నంద్యాలలో పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.

ఫ్యాక్షనిస్టులకు స్థానం లేదు
నంద్యాలలో ఫ్యాక్షనిస్టులకు రౌడీలకు స్థానం లేదని వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నంద్యాలలోని భగత్‌సింగ్ కాలనీ, పక్కీర్‌పేట, టీచర్స్ కాలనీ, ప్రభుత్వాసుపత్రి తదితర ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. శ్రమదానం బ్రిడ్జి సమీపంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. బెదిరింపులు, దౌర్జన్యాలకు ఓటుతో ధీటుగా సమాధానం చెప్పాలని ఆయన ఓటర్లను కోరారు. అబద్దాలతో మభ్యపెడుతున్న చంద్రబాబుకు దిమ్మతిరిగేలా ఉపఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని కోరారు .
Recommended Video


నంద్యాల నుండి జైత్రయాత్ర
నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల విజయంతోనే వైసీపీ జైత్రయాత్ర సాగుతోందని శిల్పా మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతోపాటు వచ్చే ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకొంటుందన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికారపార్టీ అడ్డదారులు తొక్కుతోందని ఆయన ఆరోపించారు.

నంద్యాలలో అలజడులు రేపేందుకు అధికారపార్టీ ప్రయత్నం
నంద్యాల ఉపఎన్నికల్లో అధికారపార్టీ అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని మాజీ ఎంపి అనంతవెంకటరామిరెడ్డి ఆరోపించారు. వచ్చే సాధారణ ఎన్నికలకు నంద్యాల ఉపఎన్నిక పైమీ ఫైనల్ లాంటిందన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో అలజడులను సృష్టించేందుకు టిడిపి ప్రయత్నాలను చేస్తోందని ఆయన ఆరోపించారు.

చంద్రబాబు పర్యటన
ఈ నెల 22వ, తేదిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గత నెలలో ఆయన పర్యటించారు.నెలరోజుల తర్వాత మరోసారి నంద్యాలలో ఆయన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకొంది. నంద్యాల అసెంబ్లీ స్థానంలో విజయం సాధించాలనే పట్టుదలతో చంద్రబాబునాయుడు ఉన్నారు. ఈ మేరకు ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేనాటికి అభివృద్ది , సంక్షేమ కార్యక్రమాలు పురోగతిలో ఉండేలా టిడిపి నాయకులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.












Click it and Unblock the Notifications