ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఇద్దరు నేతలపై వేటు !!

ఏపీలోని అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో వెలుగు చూసిన నకిలీ మద్యం వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై టీడీపీ అధిష్ఠానం తీవ్రంగా స్పందించింది. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జి దాసరిపల్లె జయచంద్రారెడ్డి, స్థానిక నేత కట్టా సురేంద్ర నాయుడు ఇద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

నకిలీ మద్యం తయారీ..

కాగా ములకలచెరువు ప్రాంతంలో నకిలీ మద్యం తయారీ, విక్రయాలపై ఎక్సైజ్‌ అధికారులు ఇటీవల దాడులు జరిపి కీలక ఆధారాలు సేకరించారు. విచారణలో టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు తేలడంతో పార్టీ అధిష్ఠానం అప్రమత్తమైంది. ఈ సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు వెంటనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఆదేశాలు ఇచ్చారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఇద్దరు నేతలను సస్పెండ్ చేశారు. పార్టీ ప్రతిష్ఠను కాపాడడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అలాగే నకిలీ మద్యం వ్యవహారంలో ఇద్దరి నేతల ప్రమేయంపై సమగ్ర అంతర్గత విచారణ ప్రారంభమైందని చెప్పారు.

ap-cm-chandrababu-orders-to-suspend-two-leaders-from-tdp

ఇక జయచంద్రారెడ్డి రాజకీయ జీవితం మొదటి నుంచీ వివాదాస్పదంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి సన్నిహితుడిగా ఆయన వ్యవహరించారని, దక్షిణాఫ్రికాలో ఆ కుటుంబంతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయనే ఆరోపణలు గతంలోనూ వచ్చాయి. ఇలాంటి ఆరోపణలు ఉన్నప్పటికీ, టీడీపీ అధిష్ఠానం 2024 ఎన్నికల్లో ఆయనకు తంబళ్లపల్లె టికెట్ ఇచ్చింది. కానీ ఎన్నికల్లో ఆయన పదివేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు.

అలానే ఎక్సైజ్ శాఖ దర్యాప్తులో జయచంద్రారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి రాజేశ్, సన్నిహితుడు జనార్దన్‌రావు, ఇంకా కొంతమంది బంధువుల పాత్ర స్పష్టమైంది. వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ప్రధాన నిందితులు జయచంద్రారెడ్డి, జనార్దన్‌రావు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందువల్ల వారిని పట్టుకునేందుకు పోలీసులు ఇంటర్‌పోల్ సహాయం తీసుకునే అవకాశముంది.

ap-cm-chandrababu-orders-to-suspend-two-leaders-from-tdp

ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ, పోలీసు అధికారులు ఈ కేసును మల్టీ లెవల్ దర్యాప్తుగా కొనసాగిస్తున్నారు. నకిలీ మద్యం తయారీలో ఉపయోగించిన ముడి పదార్థాల సరఫరా శ్రేణి, ఆర్థిక లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం దందాను అణచివేయడానికి ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన టీడీపీకి పెద్ద సవాల్‌గా మారిందని చర్చ నడుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+