ఎపి సిఎం చంద్రబాబు స్థానంలో యనమల...
అమరావతి: ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకావాల్సిన ఒక ముఖ్యమైన కార్యక్రమానికి ఆయన స్థానంలో ఆర్థిక మంత్రి కయనమల రామకృష్ణుడు హాజరవుతుండటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ ఆ ముఖ్యమైన కార్యక్రమం ఏమిటంటే...
గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ మంగళవారం ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా చంద్రబాబు హాజరవ్వాల్సి ఉంది. అయితే చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. ఆయన తన స్థానంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష‌్ణుడిని ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గోవాల్సిందిగా పంపారు.

సాధారణంగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి చంద్రబాబు హాజరవుతూ వస్తున్నారు. అయితే ఈసారి మాత్రం ఆయన హాజరుకాకుండా తనకు బదులుగా ఆర్థిక మంత్రి యనమలను పంపడం సహజంగానే చర్చనీయాంశం అయింది.
అయితే నేడు ముఖ్యమైన సమావేశంతో పాటు బుధవారం రాష్ట్రపతి అమరావతి రానుండటంతో చంద్రబాబు విజయ్ రూపానీ ప్రమాణస్వీకారానికి హాజరుకావడం లేదని తెలిపినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications