Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉగాదికి ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు భారీ బహుమతి.. రెడీ అవ్వండి!

సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా పేదల గృహ నిర్మాణ పథకాలపై శుభవార్త ప్రకటించారు. ఉగాదికి ఇళ్ళు లేని నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చటం కోసం ఇళ్ళ జాతర నిర్వహిస్తామని తెలిపారు. ఇల్లు లేని అర్హులందరికీ గృహాలు, ఇంటి స్థలాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 2029 నాటికి రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా ఇల్లు లేదా ఇంటి స్థలాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.

ఉగాదికి మూడు లక్షలు ఇళ్ళు, ఇంటి స్థలాలు పంపిణీ

రాష్ట్రంలో సుమారు 2.20 లక్షల కుటుంబాలకు సొంత ఇంటి స్థలాలు లేవని వీరికి పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు చొప్పున ఉచితంగా స్థలాన్ని ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ఇల్లు లేని వారందరూ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ ఉగాదికి మూడు లక్షలు ఇళ్ళు, ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామని ఈ ఏడాదిలోనే 10.63 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

ap cm chandrababu said good news on housing scheme surprise for ugadi ensure housing for all

రెండు లక్షల 20 వేల మందికి ఇల్లు లేదా ఇంటి స్థలం

ఇళ్ల నిర్మాణం పైన తమ ప్రభుత్వ విధానాన్ని వివరించిన చంద్రబాబు 2029లో అందరికీ ఇంటి స్థలం ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ విధానం అన్నారు. రెండు లక్షల 20 వేల మందికి ఎట్టి పరిస్థితులలోను ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ ఇస్తామని చెప్పిన చంద్రబాబు, ఇంటి స్థలం దొరికిన చోట్ల అపార్ట్మెంట్లు నిర్మించి అందరికీ ఇళ్ళు ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇల్లు రాని అర్హులు దరఖాస్తు చేసుకోవాలి

కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త ఇళ్ళ పోర్టల్ ను ప్రారంభించిందని చెప్పిన చంద్రబాబు, ఇంటి కోసం ప్రయత్నం చేస్తూ ఇల్లు రాని అర్హులు అందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను పరిశీలించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అర్హులను నిర్ణయించి, వారికి ఇల్లు కట్టించే బాధ్యతను తీసుకుంటాయని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

రాయచోటిలో మూడు లక్షల ఇళ్ళ నిర్మాణం

ఇక ఇదే సమయంలో రాయచోటిలో మూడు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేసిన చంద్రబాబు ఉగాదికి ముందే ఆ ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తామని వెల్లడించారు. ఈ సంవత్సరం జూన్ లో 2.5 లక్షలు ఇళ్లకు, సెప్టెంబర్లో మరో 2.1 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తామన్నారు. ఈ ఏడాది మొత్తంలో 10.60 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని చంద్రబాబు వివరించారు.

రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు అందరికీ ఇళ్ళు

అంతేకాదు అదనంగా 6 నుండి 7 లక్షల ఇల్లు కట్టాల్సిన అవసరం కూడా ఉందని ఆయన ప్రస్తావించారు. ఏది ఏమైనా రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు లేకుండా చేయడమే లక్ష్యంగా, అందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యతను తీసుకున్నట్టు చంద్రబాబు ప్రకటన చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+