వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కడప'లో చిన్న ఆశ: జగన్‌పై కౌంటర్ వేసి నవ్వించిన బాబు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

కడప: ఏపీలోని కడప జిల్లా జన్మభూమిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో ఛలోక్తులను విసిరారు. సభ ఆరంభంలో అజెండా ప్రకారం కాకుండా వేర్వేరు కార్యక్రమాలు జరిగాయి. దీంతో సీఎం చంద్రబాబు మైక్ తీసుకొని తనదైన శైలిలో స్పందించారు.

ఆయన మాట్లాడుతూ... దేశమంతా ఒక నిబంధన ఉంటే కడపకు మరో రూలుంటుందని, ఇక్కడ అందరిలో మార్పు తేవాలని అన్నారు. దీంతో అందరు ఒక్కసారిగా నవ్వారు. చంద్రన్న కానుక పంపిణీ సమయంలో.. నీ కుటుంబ ఆదాయమెంత? అంటూ ఓ లబ్ధిదారురాలిని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.

ఆమె రూ.8 వేలని, నడరం చిన్న ఆశలే ఉంటాయన్నారు. దీనికి చంద్రబాబు మాట్లాడుతూ పేదోళ్లకు చిన్న ఆశలే ఉంటాయని, కొందరు లక్ష కోట్లు సంపాదించినా ఇంకా పెద్ద ఆశలుంటాయని పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి అనడంతో సభలో అంతా నవ్వారు.

చంద్రబాబు

చంద్రబాబు

రాయలసీమలో మనల్ని చూసి కరవు భయపడే రోజు వస్తుందని, నదుల అనుసంధానంతో ఇది సాధ్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండే ఏర్పాట్లు, ఫారంపాండ్ల తవ్వకాలు, బిందు తుంపర సేద్యంతో సీమను ఉద్యానపంటల కేంద్రంగా మార్చవచ్చునని సీఎం చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

రాయలసీమను రతనాల సీమగా చేయడమే ధ్యేయమన్నారు. ఆయన కడపలోని అలంఖాన్‌పల్లెలో శనివారం జన్మభూమి-మా ఊరు, ఇడుపులపాయ ఐఐఐటీ తొలి స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

కడప సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... పోలవరం, పట్టిసీమల ద్వారా రాయలసీమ కరవు తీరుతుందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

కడప నుంచి త్వరలో విమానాలు నడపటం ద్వారా ఈ ప్రాంతం ప్రగతిబాటలో పయనించేలా చూస్తానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో పరికరాలను సమకూర్చుతామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ప్రభుత్వ వైద్యులు ఐదు, పదేళ్లు సెలవు కావాలంటే శాశ్వతంగా సెలవు తీసుకోవచ్చని, వారిస్థానంలో కొత్తవారిని నియమిస్తామన్నారు. కడపలో హజ్‌హౌస్‌ను నిర్మిస్తామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఇడుపులపాయలోని ఐఐఐటీ తొలి స్నాతకోత్సవంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఊహకు హద్దుల్లేవని, నా ఆలోచనలకు రూపమిచ్చే స్థాయిలో ఇక్కడి విద్యార్థులు ఉన్నారన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

విద్యార్థులు, అధ్యాపకులు కలిసి సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులను రూపొందించాలని, డబ్బులు నేనిస్తానని, ఉద్యోగిగా కాదు.. పదిమందికి ఉద్యోగాలిచ్చే వారు కావాలన్నారు.

English summary
AP CM Chandrababu satire on YS Jagan in Kadapa district tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X