నా వల్లే సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ సీఈఓ అయ్యాడు - సీఎం చంద్రబాబు
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అభివృద్ధి టీడీపీ హయాంలోనే తన వల్లే జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. మైక్రోసాఫ్ట్‌ను మొట్టమొదటిగా హైదరాబాద్‌కు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ అయిన సత్య నాదెళ్ల.. అక్కడి వరకు ఎదగడానికి నేను వేసిన బాటే మూలం" అని చెప్పారు. కాగా కడప జిల్లా జమ్మలమడుగులో పర్యటించిన ముఖ్యమంత్రి.. గూడెంచెరువులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటోలో ప్రజల మధ్య ప్రయాణించిన చంద్రబాబు.. ఆటో కార్మికుడికి స్వయంగా బాడుగ చెల్లించారు. అనంతరం ప్రజావేదిక వద్ద జరిగిన బహిరంగ సభలో పాల్గొని.. పలు అంశాలపై ప్రసంగించారు
వైసీపీపై మండిపడ్డ చంద్రబాబు..
బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు.. వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళా ఎమ్మెల్యేపై అసభ్యకరంగా మాట్లాడిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని.. జగన్ పరామర్శించడాన్ని తప్పుపట్టారు. పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలి. నాయకుడే రెచ్చగొడితే కిందిస్థాయి నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారని మండిపడ్డారు. అలాగే జగన్ లాంటి నాయకులు రాజకీయాల్లో అవసరమా?" అని ప్రశ్నించారు.

అసత్య ప్రచారాలు, డ్రోన్ పర్యవేక్షణపై హెచ్చరిక..
వివేకా హత్య జరిగితే మాపై విషం చిమ్మారు. సాక్షి పత్రికలో అసత్యాలు రాశారు. మభ్యపెట్టి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే చర్యలు తప్పవు అంటూ చంద్రబాబు హెచ్చరించారు. ప్రతిచోట డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ జరుగుతోందని, అందరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా కడప స్టీల్‌ప్లాంట్ విషయాన్ని ప్రస్తావించిన సీఎం, 2028 డిసెంబరు నాటికి మొదటి దశ పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. "స్టీల్‌ప్లాంట్‌తో జమ్మలమడుగు అభివృద్ధి చెందుతుంది. ఇది వాస్తవిక ప్రగతి ప్రతీక" అని అన్నారు.
ఆడ బిడ్డలు మీరే చెప్పండి.. ఇలాంటి దుర్మార్గుడు రాజకీయాల్లో ఉండటానికి అర్హుడా ?
— Telugu Desam Party (@JaiTDP) August 1, 2025
ఆంబోతు లాగా మహిళలని తిట్టిన వాళ్ళని మందలించాల్సింది పోయి, మహిళలని ఇంకా బాగా తిట్టు, నీ వెనుక నేనున్నా అని పరామర్శించి వచ్చాడు. #YCPInsultsWomen#PsychoFekuJagan#AndhraPradesh pic.twitter.com/H6zunefcCO
గండికోట, పర్యాటకం అభివృద్ధిపై ప్రకటన..
అమెరికాలో గ్రాండ్ క్యానియన్ ఉంటే, మనకు గండికోట ఉంది. దాన్ని పర్యాటక కేంద్రంగా మార్చే పనులు మొదలుపెడుతున్నాం. అక్కడ రూ.85 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం" అని ప్రకటించారు. గతంలో ఈ ప్రాజెక్ట్‌ను ఎన్టీఆర్ ప్రారంభించగా, తానే పూర్తి చేశానని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పదికి ఏడు సీట్లు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో పదికి పది సీట్లు గెలవాలన్నదే మా లక్ష్యం. ప్రజలు సిద్ధంగా ఉన్నారు" అని ధీమా వ్యక్తం చేశారు.
-
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications