ఆ టీడీపీ ఎమ్మెల్యేలను పిలిపించనున్న చంద్రబాబు ! అవసరమైతే చర్యలు..!

ఏపీలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకుంటోంది. ఈ వంద రోజుల్లో ప్రభుత్వ పాలన ఎలా ఉంది, సంక్షేమ పథకాల్లో వెనుకబాటు, అభివృద్ధి చర్యల్లో వేగం, మంత్రుల పనితీరు, మొత్తంగా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందన్న అంశాలపై జనం ఏమనుకుంటున్నది తెలుసుకునేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు అక్కడి నుంచి రాగానే కొందరు ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ అవుతారని తెలుస్తోంది.

ఈ నెల 20వ తేదీతో కూటమి సర్కార్ 100 రోజుల పాలన పూర్తి చేసుకోబోతోంది. దీంతో మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు సిద్దమవుతున్నారు. అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపైనా ఆగ్రహంగా ఉన్నారు. కొందరి వ్యవహారశైలితో మొత్తం ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని కేబినెట్ భేటీలోనే చెప్పేశారు. దీంతో వారిని గాడిన పెట్టే బాధ్యత కూడా మంత్రులకే అప్పజెప్పారు. ఇప్పుడు ప్రభుత్వంపై ఓవరాల్ గా ఫీడ్ బ్యాక్ ఎలా ఉందో కూడా తెలుసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

ap cm Chandrababu to take feedback from tdp mlas individually over 100 days rule

ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న చంద్రబాబు..రేపు లేదా ఎల్లుండి టీడీపీ ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు. గుజరాత్ నుంచి రాగానే ఎమ్మెల్యేలను విడతల వారీగా లేదా ఒకేసారి పిలిపించి మాట్లాడబోతున్నారు. కూటమి సర్కార్ 100 రోజుల పాలనపై వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోబోతున్నారు. ఈ 100 రోజుల్లో ప్రభుత్వం పాలన ఎలా ఉంది. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో వారి నుంచే అభిప్రాయ సేకరణ చేయబోతున్నారు.

ఇప్పటికే మహిళా ఎమ్మెల్యే భర్త తీరుపై చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదులు అందాయి. పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా వైసీపీ నాయకులను, కార్యకర్తలను వెంటపెట్టుకొని తిరగడం పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలపైనా చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. వీరిని స్వయంగా పిలిపించి మాట్లాడనున్నారు.
అలాగే రేపు లేదా ఎల్లుండి నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం ఉంది. తొలి విడతగా 18 కార్పొరేషన్ ఛైర్మన్ల జాబితా విడుదల చేసే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+