ఏపీ సీఎం జగన్ ఒక్కరికే భయపడుతారు.. ఆయన తప్ప ఎవరినీ లెక్కజేయడు, జేసీ సంచలనం...
టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పాలన విద్యావంతులకు అర్థమవుతోందని... కూలీలకు అర్థం కావడం లేదన్నారు. సీఎం జగన్ నియంతలా పాలిస్తున్నారని విమర్శించారు. జగన్ ఎవరి మాట వినరని.. ఒక్కరి మాట తప్ప అని కామెంట్ చేశారు. సోమవారం అనంతంపురంలో జేసీ మీడియాతో మాట్లాడారు.

అహంతో మెలగడం..
151 మంది ఎమ్మెల్యేల మెజార్టీ ఉంది అని జగన్ వీర్రవీగిపోతున్నారని జేసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మెజార్టీ ఉంటే అహం ఉండటం సరికాదన్నారు. అందరూ రాజ్యాంగానికి లోబడి నడచుకోవాలని సూచించారు. నేనే రాజు నేనే మంత్రి, చట్ం లేదు అన్నట్టు వ్యవహరించడం మంచిది కాదన్నారు. నేను చెప్పిందే జరగాలి, ప్రతిపక్షం లేదు, వారి వ్యాఖ్యలకు విలువనివ్వకపోవడం మంచి పద్ధతి కాదన్నారు.

మోడీకే భయపడతారు..
సీఎం జగన్ ఒక్క ప్రధాని మోడీకి మాత్రం భయపడుతారని జేసీ పేర్కొన్నారు. ఎందుకంటే ఆయన ఏమైనా చేస్తారనే భయంతో మెలుగుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మిగతా ఎవరన్నా లెక్కచేయరని తెలిపారు. అక్రమాస్తుల కేసుల నేపథ్యాన్ని ఉద్దేశించి జేసీ కామెంట్ చేశారని అర్థమవుతోంది. గతంలో జరిగిన ఘటనను ఉదహరించారు. బస్సుల జాతీయం చేసిన సమయంలో అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డి కోర్టు సలహామేరకు రాజీనామా చేశారని తెలిపారు.
Recommended Video

ప్రజలు ఏమనుకుంటున్నారో..
జగన్ సీఎంగా పదవీ చేపట్టి ఏడాది పూర్తయ్యింది. ప్రజలు ఏమనుకుంటున్నారో క్షేత్రస్థాయిలోకి వెళ్లి చూడాలని కోరారు. ఇబ్బందులపై ప్రజలను ఒప్పించాలన్నారు. అమరావతి రాజధాని కోసం అక్కడి ప్రజలు దీక్ష చేస్తున్నా పట్టించుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. దీక్ష స్థలికి సీఎం వెళ్లకుంటే మంత్రులను పంపించాలని సూచించారు. కానీ ఆ సమస్యను మాత్రం పట్టించుకోకుండా ఉండటం సరికాదన్నారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications