జగన్ బెయిల్ రద్దు కేసు: రఘురామ ఆరోపణలకు ఆధారాలు-అర్హత : సీబీఐ సైతం..!!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు కోరుతూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు వేసిన పిటీసన్ పైన విచారణ సాగింది. సీబీఐ కోర్టులో రఘురామ పిటీషన్ పైన జగన్ తరపు న్యాయవాదులు కౌంటర్ చేసారు. దీనికి ఎంపీ రఘురామకృష్ణంరాజు న్యాయవాదులు రీజాయిండర్లు దాఖలు చేశారు. అయితే.. రఘురామ రీజాయిండర్లపై కౌంటర్ వేస్తామని జగన్ తరుపు న్యాయవాదులు చెప్పారు. కౌంటర్ వేయడానికి వీలు లేదని సీబీఐ కోర్టు నిరాకరించింది. డైరెక్ట్‌గా రీజాయిండర్ల వాదనలు వినిపించాలని జగన్ న్యాయవాదులను సీబీఐ కోర్టు ఆదేశించింది.

దీంతో..జగన్ రతపు న్యాయవాదులు తొలి నుండి చెబుతున్న విధంగానే రఘురామ రాజు రాజకీయ దరుద్దేశంతోనే ఈ పిటీషన్ దాఖలు చేసారని కోర్టుకు నివేదించారు. పిటీషనర్ గా ఉన్న రఘురామ రాజు తన పిటీషన్ లో జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారని... దీనికి సంబంధించి ఆధారాలు చూపాలని జగన్ తరపు న్యాయవాదులు కోరారు. అసలు..ఈ పిటీషన్ కు విచారణార్హత లేదంటూ జగన తరపు న్యాయవాదులు కోర్టుకు మరోసారి నివేదించారు. పిటీషన్ వేసారనే కారణంగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ రఘురామ తరపు న్యాయవాది వాదించారు.

AP CM Jagan Bail cancellation petition:No evidence produced by Raghurama,CBI court makes key comments

కేసులో సాక్ష్యులుగా ఉన్న ఉన్నతాధికారులను ప్రత్యక్షంగా..పరోక్షంగా ప్రలోభ పెడుతున్నారని చెప్పుకొచ్చారు. కేసుల్లోని ఇతర నిందితులకు ప్రయోజనాలు కల్పిస్తున్నారని వివరించారు. ఈ కేసులో సీబీఐ చెప్పకపోవటం సరి కాదని రఘురామ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఆ సమయంలో న్యాయస్థానం రఘురామ ఆరోపణలకు బలమైన ఆధారాలు లేవంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.

దీంతో...రఘురామ - జగన్ తరపు వాదనలు పూర్తయిన తరువాత లిఖిత పూర్వకంగా తమ వాదనలు కోర్టు ముందు ఉంచుతామని సీబీఐ స్పష్టం చేసింది. జగన్..రఘురామ..సీబీఐ లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశిస్తూ న్యాయస్థానం ఈ నెల 8వతేదీకి కేసు వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+