కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ దంపతులపై దృష్టి సారించిన సీఎం జగన్... క్లీన్ స్వీప్ కోసం పట్టు చిక్కేనా??

|
Google Oneindia TeluguNews

ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాకు ఒక రాజ‌కీయ ప్ర‌త్యేకత ఉంది. ఇక్క‌డ పార్టీల‌కంటే కుటుంబాల‌కు, వ్య‌క్తుల‌కే ప్రాధాన్యం ఎక్కువ‌. దాదాపు 70 సంవ‌త్స‌రాల‌కు పైగా క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల‌ను దివంగ‌త ముఖ్య‌మంత్రి కోట్ల విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి కుటుంబం శాసించింది. సుదీర్ఘ‌కాలం కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగిన 'కోట్ల' కుటుంబీకులు రాష్ట్ర విభ‌జ‌న అనంతర పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తున్నారు. రెండోసారి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఈ జిల్లాపై, కోట్ల కుటుంబంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.

జిల్లావ్యాప్తంగా ఉన్న అనుయాయులతో సమావేశం

జిల్లావ్యాప్తంగా ఉన్న అనుయాయులతో సమావేశం


కోట్ల సూర్యప్రకాశ రెడ్డి సతీమణి సుజాతమ్మ టీడీపీలో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆలూరు నియోజ‌క‌వ‌ర్గానికి ఇన్‌ఛార్జిగా ఉన్న ఆమె ప్ర‌స్తుతం రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌దును పెట్టారు. జిల్లావ్యాప్తంగా ఉన్న కోట్ల వ‌ర్గీయులంద‌రినీ ఏక‌తాటిపైకి తెస్తున్నారు. ఇటీవలే సూర్యప్రకాశరెడ్డి, సుజాతమ్మ ఉమ్మడి కర్నూలు వ్యాప్తంగా తమ అనుయాయులతో సమావేశమయ్యారు. రానున్న ఎన్నిక‌ల్లో టీడీపీ శ్రేణుల‌ను స‌మాయ‌త్తం చేసి జిల్లాపై తమ పట్టు తగ్గలేదని నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన సుజాతమ్మ

అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన సుజాతమ్మ


సొంత పార్టీని ఓడించేందుకు కంకణం కట్టుకున్నారంటూ టీడీపీ నేతలపై ఆమె ఆరోపణలు చేయటం సంచలనం కలిగించింది. ఎన్నికల సమయంలో టిక్కెట్ల కోసం పార్టీ కార్యక్రమాలకు వచ్చే వారెవరనేది తమకు తెలుసని, వారి పట్ల అప్రమత్తంగా తాముంటున్నామని, అలాగే పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఉండాలని ప్రకటించారు. కోట్ల వర్గీయులను ఏకతాటిపైకి తెచ్చి వారికి దిశానిర్దేశం చేయడంతోపాటు గెలిపించే బాధ్యత కూడా తామే తీసుకుంటామని అధినేతకు వివరించినట్లు తెలుస్తోంది.

 ఈసారి కూడా క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో వైసీపీ

ఈసారి కూడా క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో వైసీపీ


జిల్లాలో తమ ప్రాబల్యం తగ్గకుండా ఉండేందుకు కోట్ల దంపతులు చేస్తున్న ప్రయత్నాలపై వైఎస్సార్ కాంగ్రెస్ అప్రమత్తమైంది. తమ నేతలెవరైనా వారితో టచ్ లో ఉన్నారా? అనే అంశంపై విచారించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో మొత్తం 14 నియోజకవర్గాలను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఈసారి ఎన్నికలను కూడా క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా కోట్ల కుటుంబ వ్యూహాలను చిత్తుచేయాలంటూ పార్టీ నేతలకు అధిష్టానం ఆదేశాలు జారీచేసింది.

English summary
Chief Minister Jagan focused on TDP leaders Kotla Suryaprakash Reddy and Kotla Sujathamma in Kurnool district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X