Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

vizag: వైజాగ్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ కు CM ఆహ్వానం.. సమస్యల పరిష్కారానికి ఫోన్ కాల్ దూరంలో ఉన్నట్లు వెల్లడి

vizag: ఏపీ ముఖ్యమంత్రి జగన్, తాజాగా విశాఖను రాష్ట్ర రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. నగరాన్ని పారిశ్రామిక హబ్ గా మార్చేందుకు, అక్కడికి పెట్టుబడులను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని పలువురు పారిశ్రామికవేత్తలను సీనియర్ మంత్రులు ఇప్పటికే కలిసి విజ్ఞప్తి చేశారు. కాగా ప్రభుత్వం అందించే సహకారం గురించి సీఎం, మంత్రులు మాట్లాడారు.

భారీ ఎత్తున పెట్టుబడులే లక్ష్యం

భారీ ఎత్తున పెట్టుబడులే లక్ష్యం

మార్చి 3, 4 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ జరగనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తలను ఇందుకోసం ఇప్పటికే ఆహ్వానించారు. తద్వారా పెద్ద మొత్తంలో పెట్టుబడులను రాబట్టాలని ప్రణాళికలు సైతం సిద్ధం చేశారు.

రాష్ట్రంలో విరివిగా వనరులు ఉన్నాయని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రులు చెప్పారు. రాజకీయ సుస్థిరతతో పాటు బలమైన పాలన సైతం అందిస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లడానికి విశాఖపట్నం రావాల్సిందిగా కోరారు.

మూడేళ్లుగా అగ్రస్థానం

మూడేళ్లుగా అగ్రస్థానం

2021-2022లో 11.43 శాతం వృద్ధితో భారత దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఏపీ నిలిచినట్లు ముఖ్యమంత్రి గుర్తు చేశారు. పాలనా సంస్కరణలు, పెట్టుబడిదారులతో స్నేహపూర్వక విధానాలను ప్రభుత్వం రూపొందించినట్లు చెప్పారు. సమస్యల పరిష్కారానికి ఒక్క ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటామన్నారు.

అందుకే సులభతర వాణిజ్యంలో మూడేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఇటువంటి గొప్ప అవకాశాలు ఉన్న రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టబడులు పెట్టేందుకు సాధరంగా ఆహ్వానిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.

చర్చల ఫలితంగా..

చర్చల ఫలితంగా..

గత కొన్ని రోజులుగా సీఎంతో సహా ఇతర సీనియర్ మంత్రులు సుమారు 200 మంది పెట్టుబడిదారులతో మాట్లాడారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లలో సమావేశాలు సైతం నిర్వహించారు. అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతోనూ చర్చలు జరిపారు.

వీటి ఫలితంగా విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ కు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ KM బిర్లా, సజ్జన్ జిందాల్, సంజీవ్ బజాజ్, అర్జున్ ఒబెరాయ్ సహా పలువురు దిగ్గజ పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నారు

వ్యాపార దిగ్గజాలే కాక..

వ్యాపార దిగ్గజాలే కాక..

కేవలం పారిశ్రామికవేత్తలే కాకుండా కేంద్ర మంత్రుల సైతం ఈ సమ్మెట్లో పాలుపంచుకుంటారు. దేశీయ టెక్, డేటా రంగాల అభివృద్ధిలో ఆంధ్ర పాత్ర గురించి ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడనున్నారు.

సముద్ర వాణిజ్యంలో రాష్ట్రానికి ఉన్న అపార అవకాశాలపై పోర్ట్స్, షిప్పింగ్, జలరవాణా శాఖ మంత్రి సర్భానంద్ సోనోవాల్ వివరించనున్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు కూడా ఈ సమావేశంలో పాల్గొని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలో తన ప్రసంగం ద్వారా స్ఫూర్తి నింపనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+